కేసీయార్ ఏ ముహూర్తంలో ప్రకటించారో కానీ అప్పటి నుంచి సమైక్య రాష్ట్రంపై తెలంగాణ లో జోరుగా చర్చలు మొదలయ్యాయి. మొన్నటి ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఏపీలో కూడా పార్టీ పెట్టమని తనకు వేలాది విజ్ఞప్తులు వస్తున్నట్లు ప్రకటించారు. తాను కనుక పార్టీ పెడితే దగ్గరుండి గెలిపించుకుంటామని కేసీయార్ గొప్పలకు పోయి ఆర్భాటంగా ప్రకటించారు. మరి కేసీయార్ ప్రకటన వెనక ఆంతర్యం ఏమిటో గానీ అప్పటి నుండి రివర్సు తగులుతోంది.
కేసీయార్ సమైక్య రాష్ట్రం కోసం ప్రయత్నిస్తున్నారా ? అనే చర్చ పెరిగిపోయింది. ఒక్కసారిగా సమైక్య చర్చ ఎందుకు పెరిగిపోయిందంటే మొదటిదేమో కేసీయార్ ప్రకటన అయితే రెండో కారణం ఏమిటంటే ప్లీనరీ ప్రాంగణంలో తెలుగు తల్లి విగ్రహాలు, ఫ్లెక్సీలు వాడటం. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగు తల్లి విగ్రహానికి బదులు తెలంగాణా తల్లి విగ్రహాలను ప్రత్యేకంగా చేయించిన విషయం తెలిసిందే. కేసీయార్ ఎప్పుడైతే ఏపీలో పార్టీ అని ప్రకటించారో వెంటనే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తగులుకున్నారు.
తెలంగాణా-ఏపీని కలిపేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నట్లు మండిపడ్డారు. ఇదే సమయంలో ప్రత్యేకంగా పార్టీ ఎందుకు రెండు రాష్ట్రాలను కలిపేద్దామని ఏపీ మంత్రి పేర్నినాని ప్రతిపాదించారు. దాంతో సమైక్యంపై చర్చ మరింత పెరిగిపోయింది. వీటన్నింటికీ అదనంగా కాంగ్రెస్ ఎంఎల్ఏ జగ్గారెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం వాదనను బలంగా వినిపించారు. తాను మొదటి నుండి సమైక్యవాదినే అంటు కుండబద్దలు కొట్టారు. రెండు రాష్ట్రాలు మళ్ళీ కలిసిపోతే నీళ్ళ పంచాయితీలుండవన్నారు. ఇంకా చాలా సమస్యలు పరిష్కారమైపోతాయన్నారు.
సమైక్య రాష్ట్రం విడిపోతుందా ? కరోనా వైరస్ వస్తుందని ఎవరైనా అనుకున్నారా ? అని ప్రశ్నించిన ఎంఎల్ఏ మళ్ళీ రెండు రాష్ట్రాలు కలవకూడదని ఏమన్నా ఉందా అని నిలదీస్తున్నారు. సమైక్య రాష్ట్రానికి కేసీయార్ గనుక ప్రయత్నాలు చేస్తే తాను మద్దతిస్తానంటు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన కొంత కాలంలోనే రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే బాగుండేదనే చర్చ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల్లో ఉన్న విషయాన్ని జగ్గారెడ్డి ప్రస్తావించారు.
మొత్తం మీద ఇంతకాలం నిస్త్రాణంగా ఉన్న సమైక్యంపై చర్చలు కేసీయార్ పుణ్యమాని బహిరంగంగా జరుగుతోంది. అది కూడా రాజకీయ పార్టీల్లోనే జరుగుతుండటంతో జనాల్లో కూడా చర్చలు పెరిగిపోతోంది. నిజానికి చాలామంది జనాల్లో రాష్ట్రం విడిపోవటం ఇష్టం లేదు. కాకపోతే తమ మనోగతాన్ని తెలంగాణలో వాళ్ళు బయటపెట్టలేదు. దీనికి కారణం ఏమిటంటే తెలంగాణాలో సుమారు కోటిమందికి పైగా సీమాంధ్ర జనాలుండటమే. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో సీమాంధ్ర జనాలు ఎక్కువగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మరిపుడు మొదలైన చర్చ చివరకు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.
This post was last modified on October 31, 2021 11:40 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…