పంజాబ్ రాజకీయాలలో కొద్ది రోజులుగా నాటకీయ పరిణామాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పీపీసీసీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటుండడంతో కాంగ్రెస్ అధిష్టానం తలలు పట్టుకుంటోంది. ఈ క్రమంలోనే అనూహ్యంగా కెప్టెన్ రాజీనామా చేయడం, ఆ తర్వాత సిద్ధూ కూడా తన పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ లో లుకలుకలు బజారునపడ్డాయి.
ఈ ఇద్దరికి కాకుండా మధ్యేమార్గంగా చరణ్ జిత్ సింగ్ చన్నీకి సీఎం పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్…పరిస్థితులు మెల్లగా చక్కబడతాయిలే అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానానికి పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మరో షాకిచ్చారు. కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు తగ్గట్లుగానే తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు అమరిందర్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల సంఘం అనుమతులు వచ్చిన వెంటనే పార్టీ పేరు, గుర్తును ప్రకటిస్తానని కెప్టెన్ చెప్పడంతో కాంగ్రెస్ శ్రేణులకు షాక్ తగిలినట్లయింది.
అంతేకాదు, అన్నీ అనుకున్నట్లు జరిగితే, కాలం కలిసివస్తే త్వరలో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 సీట్లలో తమ పార్టీ సొంతంగా పోటీ చేస్తుందని కెప్టెన్ వెల్లడించారు. ఒకవేళ, పరిస్థితులను బట్టి బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కూడా వెనకాడబోమని కెప్టెన్ క్లారిటీ ఇచ్చారు. అవసరమనుకుంటే బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని, అందుకు తగ్గట్లుగా సీట్ల సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు. పంజాబ్‌లో శాంతిని నెలకొల్పడమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమని కెప్టెన్ చెప్పారు.
అయితే, కాంగ్రెస్ హై కమాండ్ పై అసంతృప్తితో ఉన్న కెప్టెన్…బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. కెప్టెన్ ను పార్టీలో చేర్చుకోవడానికి అమిత్ షా సుముఖంగా ఉన్నారని, పంజాబ్ ను కైవసం చేసుకునేందుకు బీజేపీ పెద్దలు కెప్టెన్ ను తమ వైపునకు తిప్పుకున్నారని టాక్ వచ్చింది. కానీ, తాజాగా కెప్టెన్ ప్రకటనతో బీజేపీలో ఆయన చేరడం లేదని క్లారిటీ వచ్చింది. అయితే, బీజేపీతో పొత్తుకు మాత్రం కెప్టెన్ సుముఖంగా ఉండడంతో ఎన్నికల తర్వాతైన బీజేపీలో పార్టీని విలీనం చేసే చాన్స్ ఉందని టాక్ వస్తోంది. మరోవైపు, తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని సిద్ధూ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on October 27, 2021 6:52 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…