తాలిబన్ల అధికారంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లో ఆకలి చావులు పెరిగిపోతున్నాయా ? వరల్డ్ ఫుడ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం అవుననే అర్ధమవుతోంది. దేశంలోని 3.9 కోట్ల మంది జనాభాలో సుమారు 2.3 కోట్లమంది రోజుకు ఒక పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు. వీరిలో అత్యధికులు పేదలు, వారి పిల్లలే ఉన్నట్లు సమాచారం. మూడు వారాల క్రితం పశ్చిమ కాబూల్ లోని ఓ ఇంట్లో రోజుల వ్యవధిలో 8 మంది పిల్లలు ఆకలిని తట్టుకోలేక చనిపోయిన విషయం బయటపడింది.
8 మంది పిల్లలు ఆకలితో చనిపోయిన ఘటన ప్రపంచాన్ని కుదిపేస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం 8 మంది పిల్లలు ఆకలితో చనిపోయిన విషయం వెలుగు చూసింది. మరి వెలుగు చూడని ఘటనలు ఎన్ని ఉన్నాయో అని ఐక్య రాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నాక విదేశాల నుంచి ఆహార పదార్థాలు, నిత్యావసరాల దిగుమతులు ఆగిపోయాయి. ఇదే సమయంలో దేశం నుంచి ఎగుమతులు కూడా తగ్గిపోయాయి. గమనించాల్సిందేమంటే దేశంలోకి దిగుమతులే ఎగుమతులు దాదాపు ఉండవనే చెప్పాలి.
తాలిబన్లను ప్రపంచం గుర్తించని కారణంగా చాలా దేశాలు తమ వ్యాపారాలు నిలిపేశాయి. దీంతో దేశంలోకి ఆహార పదార్థాల దిగుమతులు ఆగిపోవటంతో కొరత పెరిగిపోయింది. దీని ప్రభావం ఎక్కువగా ఎగువ మధ్య తరగతి, మధ్య తరగతి, పేదల మీద పడింది. ఆహారం కోసం అవకాశం ఉన్నవారు తమ ఆస్తులను అమ్మేసుకుంటున్నారు. అలాగే ఇంట్లోని రిఫ్రిజిరేటర్లు, టీవీలు, సోఫాలు, మంచాల్లాంటి విలువైన ఫర్నీచర్ ను కూడా అమ్మేసుకుంటున్నారు.
కంటి ముందు ఆహారం, పండ్లు కనబడుతున్నా చాలామంది కొనలేకపోతున్నారు. కారణం ఏమిటంటే కొనే స్తోమత లేకపోవటమే. కిలో బంగాళదుంప దాదాపు వెయ్యి రూపాయలట. ఒక బ్రెడ్డు ధర 400 రూపాయలట. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పోయిన నేపథ్యంలో చాలా మందికి సంపాదన నిలిచిపోయింది. దీంతో ఆహారాన్ని కొనలేకపోతున్నారు. ఫలితంగా ఆకలి చావులు పెరిగిపోతున్నాయి. మధ్య తరగతి కుటుంబాలే రోజుకు మూడు పూట్లా భోజనం చేసి రోజులవుతున్న నేపథ్యంలో ఇక పేదల పరిస్థితి ఆలోచించాల్సిన అవసరమే లేదు.
నూనెలు, గోధుమలు, బియ్యం లాంటి నిత్యావసరాల ధరలు 55 శాతం పెరిగాయట. తాలిబన్లు అధికారాన్ని కబ్జా చేయడానికి ముందు కూడా దేశంలో సుమారు 1.4 కోట్ల మంది ఆహార సంక్షోభంలోనే ఉన్నారని ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రకటించింది. ఇపుడీ సంఖ్య 2.3 కోట్లకు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ముందు ముందు ఈ సంఖ్య గనుక మరింత పెరిగితే అది చాలా ప్రమాదమని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార సంక్షోభాన్ని అధిగమించేందుకు దేశంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఐక్య రాజ్య సమితికి అర్థం కావట్లేదు. బహుశా తాలిబన్లు అధికారంలో ఉన్నంత కాలం పరిస్థితి ఇలాగే ఉంటాయోమో అనిపిస్తోంది.
This post was last modified on October 26, 2021 12:03 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…