Political News

షర్మిలతో వైసీపీ నేతల వరుస భేటీలు

వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్రకు ఊహించిన అతిథులు వస్తున్నారు. వారు చుట్టం చూపు వచ్చిపోవడం లేదు. పాదయాత్ర తీరుతెన్నులను ప్రజల్లో వస్తున్న ఆధరణను గమనిస్తున్నారు. పాదయాత్రపై ఆరా తీసిస్తున్నారు. ఆదివారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, షర్మిలను కలిసి వెళ్లారు. సోమవారం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. వీరిద్దరూ సీఎం జగన్‌కు షర్మిలకు అత్యంత సన్నిహితులు.

రెండు రోజుల వ్యవధిలో సుబ్బారెడ్డి, రామకృష్ణారెడ్డి పాదయాత్రలో ఉన్న షర్మిలతో భేటీ కావడం అటు ఏపీలో ఇటు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. వీరి రాకపై అనేక చర్చలు సాగుతున్నాయి. ఈ నేతలు ఊరికే వస్తున్నారా? లేక ఏమైనా రాయబారం నడుపుతున్నారా? జగన్ ఏదైనా సందేశాన్ని ఇచ్చి పంపుతున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. జగన్ దూతలుగా వస్తే నిన్ననే సుబ్బారెడ్డి వచ్చి వెళ్లారా కదా.. 24 గంటలు గడవకముందే రామకృష్ణారెడ్డి ఎందుకు వచ్చారు.. వీరి రాకకు కారణాలు ఏమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు.

కందుకూరు మండలంలో జరిగిన షర్మిల పాదయాత్రలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. కందుకూరు మండలం లేమూరులో పాదయాత్రలో భాగంగా నిర్వహించిన మాట- ముచ్చట కార్యక్రమంలో ఆళ్ల పాల్గొన్నారు. అయితే ఆయన వేదిక పంచుకోకుండా ప్రజల మధ్యలో కూర్చొని షర్మిల ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. మాట-ముచ్చట కార్యక్రమం జరిగే ప్రాంతంలో ఒక ఇంటి మెట్లపై జనం మధ్యే కుర్చోని ఆసక్తిగా కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం పాదయాత్రలో అందరితో కలిసి నడిచారు.

సోమవారం రాత్రి ఆర్మియాగూడలో క్యాంప్‌ వద్ద షర్మిలతో గంటపాటు భేటీ అయ్యారు. ఆదివారం వైవీ సుబ్బారెడ్డి, మహేశ్వరంలో షర్మిలతో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. షర్మిలతో వైసీపీ నేతల వరుస భేటీలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. షర్మిల పార్టీ పెట్టేందుకు సన్నహాకాలు చేస్తున్న సమయంలో కూడా షర్మిలతో ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. లోటస్ పాండ్‌లో షర్మిలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆమెతో కేవలం 10 నిమిషాలు మాత్రమే భేటీ అయ్యారు. అయితే అనిల్‌కుమార్‌తో ఏకాంతంగా దాదాపు గంటపాటు మంతనాలు జరిపారు. షర్మిల పార్టీ ఏర్పాటు చేయకముందు.. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత రామకృష్ణారెడ్డి భేటీ కావడం ప్రధాన్యత సంతరించుకుంది.

చేవెళ్ల నుంచి చేపట్టిన పాదయాత్ర సోమవారం ఆరో రోజు మహేశ్వరం నుంచి తుమ్మలూరు, మీదుగా కందుకూరు మండలం రాచులూరుగేటు, లేమూరు మీదుగా తిమ్మాపురం శివారు వరకు 14.6 కిలో మీటర్లు కొనసాగింది. లేమూరులో జరిగిన మాటా-ముచ్చట కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ తాను తెలంగాణ ఆడ బిడ్డనని చెప్పారు. ఇక్కడే చదువుకున్నానని, తాను తెలంగాణ వ్యక్తిని వివాహం చేసుకున్నానని గుర్తుచేశారు.

1,200మంది విద్యార్థులు, యువకులు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారని తెలిపారు. నీళ్లు, నిధులు నియామకాల కోసం ఉద్యమం జరిగితే ఫలితాలను మాత్రం కేసీఆర్‌ కుటుంబం అనుభవిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతోనే ప్రజల ముందుక వచ్చానని స్పష్టం చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వంటి సంక్షేమ పాలన, పథకాలు తిరిగి తెచ్చుకోవాలంటే వైఎస్ఆర్‌టీపీ ఆశీర్వదించాలని షర్మిల ప్రజలను కోరారు. మహేశ్వరం టీఆర్ఎస్‌ బహిష్కృత నేత మోహన్‌రెడ్డి షర్మిల సమక్షంలో వైఎస్ఆర్‌టీపీ చేరారు. మహేశ్వరం మండలం సిగిరిపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్‌ బహిష్కృత నేత ఎడ్మ మోహన్‌రెడ్డి సోమవారం వైస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల సమక్షంలో పార్టీలో చేరారు.

This post was last modified on October 26, 2021 9:30 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

5 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

6 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

7 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

7 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

8 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

9 hours ago