ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్(ఐఏఎన్ ఎస్) సీ-ఓటర్ సర్వే తాజాగా వెలువరించిన నివేదికపై వైసీపీలో చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి ఈ ఫలితాన్ని కొన్నాళ్లుగా అందరూ ఊహించిందే కావడం గమనార్హం. ఎందుకంటే.. రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరు సరిగాలేదని..వారు ప్రజల మధ్య ఉండడం లేదని వాదన వినిపిస్తోంది. అయితే.. తమకు అసలు చేసేందుకు ఏమీ లేదని..ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా సీ ఓటరు సర్వే ఫలితాలు రావడం.. వైసీపీలో చర్చకు దారితీసింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఎమ్మెల్యేలపై ప్రజలు ఎక్కువ ఆగ్రహంతో ఉన్న రాష్ట్రం ఏపీనేనని.. సర్వే స్పష్టం చేసింది.
నిజానికి ఏపీలో పరిస్థితిని గమనిస్తే.. ప్రజలకు-ఎమ్మెల్యేలకు మధ్య ఉండాల్సిన సున్నిత బంధం కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఒకప్పుడు ప్రజలు తమకు ఏదైనా పనికావాలంటే.. నేరుగా ఎమ్మెల్యే ఇంటివి వచ్చేవారు. తమసమస్యలు చెప్పుకొనేవారు. అదేసమయంలో ఎమ్మెల్యే కూడా.. ప్రజల మధ్య ఉండేవారు. ఎన్నికల్లో ప్రజల ఓట్ల కోసం పాకులాడేవారు. అయితే.. రాను రాను .. పార్టీ అదినేతను చూసి ఓట్లు అడిగే పరిస్థితి రావడం ప్రారంభమైంది. 2019 ఎన్నికలను తీసుకుంటే.. అటు వైసీపీ అధినేత జగన్.. ఇటు టీడీపీ అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు కూడా తమను చూసి ఓట్లేయాలంటూ.. ప్రజలను అభ్యర్థించిన పరిస్థితి కనిపించింది.
దీంతో అప్పటి నుంచే.. ప్రజలకు ఎమ్మెల్యేలకు మధ్య ఉండాల్సిన కనీస బంధం కాలగర్భంలో కలిసిపోతోందనే వాదన వినిపించడం ప్రారంభమైంది. ఇక, రాష్ట్రంలో వచ్చిన వలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత.. ఎమ్మెల్యేలతో దాదాపు ప్రజలకు సంబంధాలు కట్ అయ్యాయి. ఏం కావాలన్నా.. వలంటీర్‌కు పోన్ చేయడం.. పరిపాటిగా మారింది. అదేసమయంలో ప్రభుత్వ పథకాలకు లబ్ధి దారుల ఎంపిక కూడా వలంటీర్ల చేతుల మీదుగానే సాగుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రమేయం ఎక్కడా కనిపించడం లేదు. దీంతో సహజంగానే ఎమ్మెల్యేకు.. ప్రజలకు మధ్య సంబంధాలు కనిపించడం లేదనే వాదన కొన్నాళ్లుగా కనిపిస్తోంది.
ఇక, ఇదే అవకాశం అనుకున్నారో.. లేక మరేమో.. తెలియదు కానీ.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. సొంత పనుల్లో పూర్తిగా మునిగిపోయారు. నియోజకవర్గంలో ఉన్నా.. ప్రజలకు అందుబాటులో లేక పోవడం.. కొందరి వంతుగా ఉంటే.. అసలు నియోజకవర్గంలోనే లేని ఎమ్మెల్యేలు..కూడా పదుల సంఖ్యలో కనిపిస్తోంది. తమ వ్యాపారాలు, వ్యవహారాల కోసం.. ఎమ్మెల్యేలు.. పొరుగు రాష్ట్రాల్లో తిష్ట వేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో నియోజకవర్గం అభివృద్ధి అనే మాటే ఎత్తనివారు కనిపిస్తున్నారు. ఇవే విషయాలపై కొన్నాళ్లు గా సోషల్ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ.. ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారు. తాజాగా వచ్చిన సీ ఓటర్ సర్వే.. వారిలో ఇప్పుడు అలజడి రేపుతోంది. మరి ఇప్పటికైనా.. తమ పంథా మార్చుకుని.. ప్రజల్లోకి వస్తారో.. లేదో చూడాలి.
This post was last modified on October 20, 2021 11:50 pm
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…