టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా.. నలుగురు కీలక నేతలపై గుంటూరు జిల్లా పోలీసులు.. హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు.. ఏ1గా నారాలోకేష్‌ను, ఏ2గా ఎమ్మెల్సీ పరుచూరు అశోక్‌బాబును, ఏ3గా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను, ఏ4గా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ను చేర్చారు. అంతేకాదు.. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు. అదేంటి.. టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతలు దాడులకు తెగబడితే.. తిరిగి టీడీపీ నేతలపైనే కేసులు ఎందుకు నమోదు చేశారనే సందేహం సర్వత్రా వినిపిస్తుంది.
దీనిపై పోలీసులు చెబుతున్నదేంటంటే.. వైసీపీ నాయకులు.. టీడీపీ ఆఫీస్‌పై దాడులు చేసిన మాటవాస్తవ మేనని.. అయితే.. ఈ క్రమంలో అక్కడ ఏం జరిగిందనే విషయాలను పరిశీలించేందుకు సీఐ.. నాయక్ అనే వ్యక్తి.. టీడీపీ ఆఫీస్‌లో పర్యవేక్షణకు వచ్చారని.. అయితే.. ఆయనను టీడీపీ నాయకులు.. నిర్బంధించి.. కొట్టి.. హత్య చేసేందుకు ప్రయత్నించారని.. అంటున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ సహా.. ఇతర నేతలపై కేసులు పెట్టారు. అయితే.. వాస్తవానికి ఆ సమయంలో వచ్చిన నాయక్ అనే వ్యక్తి విషయం మీడియాలో వచ్చింది. అయితే.. ఆయన పోలీస్ అనే విషయం ఎవరికీ తెలియకపోవడం గమనార్హం.
ఎందుకంటే.. అప్పటికే తీవ్ర అలజడితో ఉన్న టీడీపీ ఆఫీస్‌లోకి వచ్చిన నాయక్.. ఎవరికీ ఏమీ చెప్పకుండా .. తన ఐడెంటిటీని తెలుపకుండానే ఫొటోలు తీయడం.. వీడియోలు తీయడం చేశాడు. దీంతో సహజంగానే టీడీపీ నేతలకు అనుమానం వచ్చి.. ఆయనను పట్టుకుని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తదితరుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో నాయక్‌ను తమ అదుపులో ఉంచుకున్న ఆనందబాబు, అశోక్‌బాబు.. తదితరులు.. గుంటూరు రూరల్ పోలీసులకు సమాచారం అందించి.. ఆయనను అప్పగించారు. మరి జరిగింది.. ఇదైతే.. నాయక్‌పై హత్యా యత్నం జరిగిందని.. నారా లోకేష్ ప్రయత్నించారని.. పేర్కొంటూ.. కేసు నమోదు చేయడం వంటివి పోలీసుల ద్వంద్వ వైఖరిని చెబుతోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇది ఏ తరహా వివాదానికి దారితీస్తుందో చూడాలి.
This post was last modified on October 20, 2021 3:51 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…