Political News

రేవంత్ కు ఢిల్లీలో తలంటు తప్పలేదా?

పని చేసే వాడి కంటే.. పని చేస్తున్న వాడి తప్పుల్ని వెతికే విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని శక్తులు మరే రాజకీయ పార్టీలో కనిపించవు. కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీల్లో మాత్రం.. మనం పని చేయటం.. చేసేవాడు ఎలా చేస్తేనేం అన్నట్లుగా ఫీల్ కావటం కనిపిస్తుంది. కానీ.. కాంగ్రెస్ లో మాత్రం.. కాస్త పని చేసినా.. దానికి ఏవో లెక్కల్ని తెర మీదకు తీసుకొచ్చి.. నెగిటివ్ అంశాన్ని చర్చకు తెచ్చి.. అధిష్ఠానానికి కంప్లైంట్ చేయటం మామూలే.

ఈ కారణంతోనే.. కాంగ్రెస్ రాష్ట్ర రథ సారథులకు ఇలాంటి తలనొప్పులు తరచూ ఎదురవుతుంటాయి. ఆ మధ్యన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు బోలెడన్ని ఎదురవుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ కిందకు చూడటమే కానీ పైకి చూసింది లేదు. ఆ విషయం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తెలుసు.. అధిష్ఠానానికి తెలుసు. ఒక దశలో కాంగ్రెస్ పని అయిపోయిందంటూ గులాబీ అధినేత మొదలు మిగిలిన నేతలంతా ఎక్కెసాలు చేయటం.. దానికి వేదనతో ఇంట్లో కూర్చొని పళ్లు నూరుకోవటం మినహా చేసిందేమీ లేదు. ఇలాంటివేళ.. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గులాబీ దళానికి చురుకు పుట్టేలా చేయటమే కాదు.. ఇవాల్టి రోజున కేసీఆర్ అండ్ కో బీపీ పెరిగేలా చేయటంలో రేవంత్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

తమకు చేతకానిది.. ఎవరికి చేతకాకూడదన్నట్లుగా ఫీలయ్యే టీ కాంగ్రెస్ నేతలు.. రేవంత్ మీద ఏదో ఒక విమర్శను.. ఆరోపణను తీసుకొచ్చి అధిష్ఠానం ముందు పెడుతున్నారు. అయినప్పటికి రేవంత్ కు కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పటికి.. అప్పుడప్పుడు మాత్రం క్లాసులు పీకుతున్నట్లు చెబుతున్నారు. తాజాగా అలాంటి పరిస్థితి రేవంత్ కు ఎదురైందని చెబుతున్నారు. ఈ మధ్యన ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా అధిష్ఠానం ఒక విషయంలో క్లాస్ తీసుకున్నట్లు చెబుతున్నారు.

సోషల్ మీడియాలో రేవంత్ ప్రజా దర్బార్ పేరుతో చేసే ప్రచారం గురించి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రచారంపై గుర్రుగా ఉన్న మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్ఠానానికి కంప్లైంట్ చేసినట్లుగా సమాచారం. దీనిపై రేవంత్ ను వివరణ కోరారని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత కూడా ఇలాంటి ప్రచారం అవసరమా? అని ప్రశ్నించటంతో పాటు.. ఇలాంటివి వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. ఇలాంటి ప్రచారంతో తన వ్యక్తిగత ఇమేజ్ తో పాటు పార్టీ ఇమేజ్ కూడా పెరుగుతుందని కన్వీన్స్ చేసినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. తనకు షాకిచ్చేలా చేస్తున్న సీనియర్ల తీరుకు రేవంత్ ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు.

This post was last modified on October 14, 2021 2:54 pm

Share

Recent Posts

మండాడి మెరుపు దాడి ఎవరు ఊహించారు

త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…

1 hour ago

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

2 hours ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

2 hours ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

3 hours ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

4 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

4 hours ago