మోడీ ప్రభతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి కేంద్రంలో అధికారాన్ని దక్కించుకుంది. మోడీ తొలిసారి ప్రధాని అయ్యారు. 2019 ఎన్నికల్లోనూ ఆయన ప్రభతో దేశవ్యాప్తంగా కాషాయ పవనాలు వీచాయి. మళ్లీ గెలిచి రెండో సారి ప్రధాని పదవిని సొంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే చెప్పొచ్చు. దేశమంతా మోడీ ప్రభ క్రమంగా పడిపోతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా మోడీకి వివిధ సందర్బాల్లో వచ్చిన బహుమతులు జ్ణాపికలకు ఈ వేలం నిర్వహిస్తే వస్తున్న ఆదరణ అంతంత మాత్రంగానే ఉండడం అందుకు కారణం.
ప్రధాన మోడీ వాడిన వస్తువులంటే చాలా క్రేజ్ ఉండేది. గతంలో ఆయన తొడిగిన ఓ కోటు కోసం ఓ వ్యక్తి ఏకంగా రూ.4.31 కోట్లు చెల్లించాడు. గతంలో ఆయనకు వచ్చిన బహుమతులు ఈ- వేలం వేస్తే తీవ్రమైన పోటీ ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. నేటితో ముగియనున్న ప్రస్తుత వేలంలో ఏకంగా 162 వస్తువులకు ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడం విశేషం. అందులో మోడీ తన తల్లితో దిగిన ఫొటో కూడా ఉంది. గంగా నది ప్రక్షాళన కోసం ఏర్పాటు చేసిన నమామి గంగే ప్రాజెక్టుకు నిధుల సేకరణ కోసం ప్రస్తుతం ఈ- వేలం జరుగుతోంది. సెప్టెంబర్ 17న మొదలైన ఈ వేలం అక్టోబర్ 7న ముగుస్తుంది. ఒలింపిక్స్ పారాలింపిక్స్‌లో అద్బుత ప్రదర్శన చేసిన అథ్లెట్లు మోడీకి అందించిన క్రీడా పరికరాలతో పాటు ఇతర వస్తువులు ఈ వేలంలో ఉన్నాయి.
ఒలింపిక్స్‌లో పసిడితో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా విసిరిన ఈటెకు రూ.కోటి 50 వేలు పలికింది. రెండు ఒలింపిక్స్ పతకాలు సాధించిన తొలి భారత మహిళగా నిలిచిన పీవీ సింధు రాకెట్కు రూ.80,00,100 పలికింది. ఇక్కడ ఈ వస్తువులకు భారీ ధర వచ్చిందంటే అందుకు కారణం ఆయా క్రీడాకారులకున్నా క్రేజ్ కానీ మోడీ ప్రభ ఎంత మాత్రం కాదు. ఎందుకంటే మోడీ వాడిన కండువాలు దుప్పట్లు బూట్లు వివిధ దేశాల వాళ్లు మెడలో వేసిన శాలువాలు ఇలా చాలా వస్తువుల కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. దేశవ్యాప్తంగా మోడీకి ఆదరణ దక్కుతుందనడానికి ఇదే నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేశాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా కట్టడిలో విఫలం సాగు చట్టాలపై మొండి వైఖరి పెగాసస్ వ్యవహారం ఇంధన ధరలను నియంత్రించలేకపోవడం.. ఇలా చాలా విషయాల్లో మోడీ ఫెయిల్ అయ్యారంటూ దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ వ్యతిxరేకతను తగ్గించుకుని తిరిగి ప్రజల ఓట్లు గెలుచుకునేందుకు మోడీ ప్రయత్నాలు మొదలు పెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం మోడీకి ఎదురు దెబ్బ తగలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
This post was last modified on October 7, 2021 2:38 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…