Political News

వైరల్ వీడియో: ‘లఖింపర్ ఖేరి’ ఆరాచకం

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన యూపీలోని ‘లఖింపర్ ఖేరి’ అరాచకాన్నిఇంతవరకు కేవలం విన్నాం. ఆ దారుణానికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోలో.. నిరసన చేస్తున్న వారు.. తమ దారిన తాము ముందుకు నడుస్తున్న వేళ.. ఏ మాత్రం కనికరం లేకుండా వాహనంతో గుద్దేసి.. ముందుకు వెళ్లిన వైనం షాకింగ్ గా మారింది. అధికారంతో కన్నుమిన్ను కానకుండా ఉన్న వైనం చూస్తే.. బీజేపీ నేతల అరాచకం ఏ స్థాయిలో ఉంటుందన్న విషయం తాజా వీడియో స్పష్టం చేస్తుందని చెప్పాలి.

ఎంత అధికారం అండగా ఉంటే మాత్రం మనుషుల ప్రాణాలు తీయడం ఏమిటి? ఈ నేరపూరిత ధోరణి చూస్తే.. అధికార బలుపు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇంతకాలం సినిమాల్లో మాత్రమే చూసిన ఇలాంటి సీన్.. ఇప్పుడు రియల్ గా చూడాల్సిన పరిస్థితి. ఇంత చేసి కూడా.. తన కుమారుడు ఘటన జరిగిన దగ్గర లేదన్న కేంద్ర సహాయ మంత్రి మాట వింటే.. ఆయన మాటలకు చేతలకు మధ్యనున్న తేడా ఎంతన్న విషయం తాజా వీడియో స్పష్టం చేస్తుందని చెప్పాలి.

అంతేకాదు.. తన దారికి అడ్డు వచ్చే వారిని ఎలాంటి మొహమాటం లేకుండా బెదిరింపులకు దిగడం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాకు అలవాటే అన్న విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. గతంలో ఒకసారి ఆగ్రహానికి గురైన సందర్భంలో తాను తలుచుకుంటే.. అందరిని దారిలోకి తెచ్చుకోవటానికి రెండు నిమిషాలకు మించిన సమయం పట్టదని.. తాను ఎంపీ కాక ముందు ఏమిటన్న విషయం అందరికి బాగా తెలుసని ఆయన స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు అందరికీ గుర్తుకువస్తున్నాయి.

ఒకసారి తాను రంగంలోకి దిగితే మీరున్న ప్రాంతమే కాదు.. ఆ చుట్టుపక్కల కూడా ఉండలేరన్న మాట కూడా ఆయన అన్నారు. ఇలాంటి వారి చేతుల్లో అధికారం ఉంటే ఇంకెన్ని అరాచకాలు చేస్తారో అని కాంగ్రెస్ నేతలు, ఈ ఘటన చూసిన ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందించే మోడీ.. ఈ ఉదంతంపై ఇప్పటివరకు ఎందుకు రియాక్టు కానట్లు?

This post was last modified on October 5, 2021 11:12 am

Share

Recent Posts

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

5 minutes ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

33 minutes ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

38 minutes ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

4 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

4 hours ago

రణబాలికి కాంతార రంగు

ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…

5 hours ago