ఏపీ సీఎం జగన్ సొంత జిల్లాలోని.. ఎస్సీ నియోజకవర్గం బద్వేల్ లో ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనుంది. అయితే.. దీనికి సంబంధించి.. వైసీపీ గత ఎన్నికల్లో తమ పార్టీ తరఫున గెలిచి అనారోగ్యంతో మృతి చెందిన వెంకటసుబ్బయ్య సతీమణి సుధకే టికెట్ ఇచ్చింది. దీనికి సంబంధించి వైసీపీ పెద్ద ఎత్తన ప్రచారానికి కూడా రెడీ అయింది. అంతేకాదు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా బాధ్యతలు అప్పగించారు. ఎలా గెలవాలి? టీడీపీని ఎలా ఎదుర్కొనాలి? అనే వ్యూహాలపై అప్పుడే కసరత్తు కూడా ప్రారంభించారు. జగన్ అయితే వైసీపీ నేతలకు బద్వేల్లో 60 వేల మెజార్టీ రావాలని టార్గెట్ పెట్టారు.
అక్కడ ఉప ఎన్నిక బాధ్యతను కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి అప్పగించారు. అక్కడ భారీ మెజార్టీ కోసం మూడంచెల వ్యూహం కూడా రూపొందించారు. అయితే..ఇంతలోనే.. ప్రధాన ప్రతిపక్షం .. టీడీపీ, మరో పక్షం జనసేనలు.. ఇక్కడ నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించాయి. దీంతో వైసీపీ నేతలకు పనిలేకుండా పోయింది. అంతేకాదు.. ఇక్కడ ఏకగ్రీవం అయ్యేందుకు ఛాన్స్ ఉందనే సూచనలు వస్తున్నాయి. ఎందుకంటే.. వాస్తవానికి రాష్ట్రంలో బలమైన పక్షాలు రెండు తప్పుకొన్న తర్వాత.. బీజేపీ ఇక్కడ నుంచి పోటీ చేస్తామని అనుకున్నా.. కేంద్ర అధిష్టానం సూచనల మేరకు ఇక్కడ నుంచి పోటీ చేస్తామని ప్రకటించారు.
ఈ క్రమంలో కేంద్ర బీజేపీ పెద్దలతో వైసీపీకి ఉన్న రిలేషన్‌ను బట్టి.. ఇక్కడ పోటీ చేసే అవకాశం లేదని.. అంటున్నారు. ఇక, మిగిలిన పార్టీలో కమ్యూనిస్టులు దీనిపై ఎలాంటి చర్చచేపట్టలేదు. పైగా.. పోటీ చేస్తారో.. లేదో తెలియదు. ఇక, మరో పార్టీ బీఎస్పీ.. ఉన్నా.. పోటీ చేస్తామని అయితే.. ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే.. అందరికీ కూడా సెంటిమెంటు ఇక్కడ ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. ఎస్సీ వర్గానికి చెందిన వెంకట సుబ్బయ్య మరణం తర్వాత.. ఆయన సతీమణినే ఇక్కడ వైసీపి నిలబెట్టడంతో .. తాము పోటీ చేస్తే.. ఎస్సీ వర్గంపై.. ఎస్సీలే పోటీ చేస్తున్నారని.. కనీసం సింపతీ కూడా చూపించడం లేదనే వాదన బలంగా బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో బీఎస్పీ తప్పుకొనే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. ఇక, బీజేపీ ఒక్కటే బరిలో నిలిచినా.. పోటీ వరకు పరిస్థితి ఉండదని అంటున్నారు..మొత్తానికి చంద్రబాబు తీసుకున్న ఒక్క నిర్ణయం.. వైసీపీ నేతలకు పనిలేకుండా చేసిందనే టాక్‌రాజకీయ వర్గాల్లో వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on October 5, 2021 9:26 am
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…