ఏపీలోని కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఎలాంటి ట్విస్టులు ఉండవని అనుకుంటే… అదిరిపోయే ట్విస్టులు చోటు చేసుకునే వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి సుధ పోటీలో ఉంటున్నారు. ఇక టీడీపీ నుంచి గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన ఓబులాపురం రాజశేఖర్ మరోసారి బరిలో ఉంటున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పేరు ఖరారైంది.
ఇక జనసేన – బీజేపీ పొత్తులో ఉండడంతో ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ అభ్యర్థి బద్వేల్ బరిలో ఉంటారా ? అని నిన్నటి వరకు కాస్త సస్పెన్స్ నెలకొంది. కడప జిల్లాలో ఈ ఉప ఎన్నిక జరుగుతూ ఉండడం.. ఇక్కడ బీజేపీకి నుంచి బలమైన నేతలుగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డితో పాటు సీఎం రమేష్ లాంటి వాళ్లు ఉండడంతో బీజేపీ అటూ ఇటూ తిప్పేసి తిరుపతి ఉప ఎన్నికల్లోలా మరోసారి తమ పార్టీ అభ్యర్థినే పోటీ పెడుతుందనే అందరూ అనుకుంటున్నారు.
అయితే ఇంతలోనే జనసేన ఇక్కడ ట్విస్ట్ ఇచ్చింది. ఈ ఎన్నికలో బరిలో నిలవాలని జనసేన పార్టీ యోచిస్తోంది. జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా విజయజ్యోతిని బరిలోకి దించనున్నట్లు సమాచారం వస్తోంది. విజయజ్యోతి గతంలో బ్యాంక్ ఆఫీసర్‌గా పనిచేశారు. 2014 ఎన్నికలలో ఆమె టీడీపీ నుంచి ఇక్కడ పోటీ చేసి జయరాములు చేతిలో ఓడిపోయారు. తర్వాత జయరాములు టీడీపీలోకి జంప్ చేయడంతో ఆమెకు అక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో ఆమె గత ఎన్నికలలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు జనసేన అక్కడ నుంచి తమ పార్టీ తరపున విజయజ్యోతిని రంగంలోకి దింపేలా ఒప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టింది.
జనసేన రాష్ట్ర నాయకులు కొందరు విజయజ్యోతికి ఫోన్ చేసి జనసేన తరపున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారట. అయితే నియోజకవర్గంలో కొంత పట్టున్న ఆమె తన అనుచరులతో చర్చించి తన నిర్ణయం చెపుతానని అన్నట్టు కూడా తెలిసింది. మరి జనసేన బీజేపీతో చర్చించాక తమ పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేస్తుందా ? లేదా సొంత నిర్ణయం తీసుకుందా ? అన్నది తెలియాలి. ఏదేమైనా మళ్లీ ఇక్కడ బీజేపీయే పోటీ చేయాలని అనుకుంటోన్న సమయంలో జనసేన ఇలా దూకుడుగా వ్యవహరిస్తుండడం బీజేపీకి కాస్త షాక్ లాంటిదే.
అయితే పవన్ ఎప్పటి లాగానే ముందు హడావిడి చేసి.. చివర్లో బీజేపీకి బెండ్ అయిపోతారేమో కూడా చూడాలి. ఇక మరోవైపు వైసీపీ అభ్యర్థిగా పోటీలో నిలుస్తున్న సుధను గెలిపించడానికి ఆ పార్టీ అధిష్ఠానం పలువురికి బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే బద్వేలులో వైసీపీ నేతలు ప్రచారం ప్రారంభించారు.
This post was last modified on October 2, 2021 4:04 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…