రాజకీయ పార్టీలకు రాజగురువులు, గాద్ ఫాదర్‌లు ఉన్నప్పటికీ రాజకీయ వ్యూహకర్తలను ఆశ్రయిస్తున్నారు. తమకు ఉన్న బ్యాక్ గ్రౌండ్ పాటు వ్యూహకర్తల విధానాలతో సునాయాసంగా విజయం సాధిస్తున్నారని భావిస్తున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్లు సైతం ప్రశాంత్ కిషోర్ లాంటి వారి కోసం పోటీపడుతున్నారు. రాజకీయ నాయకులు కూడా సిద్ధాంతాలను మరచిపోయారు. ప్రజా సమస్యలను ప్రస్తావించి, పోరాటాలు చేయడం మరచిపోయారు. వ్యూహకర్తలో కోట్లలో ఖర్చు చేస్తున్నారు. సీఎం పీఠం దక్కాలి కానీ కోట్లు ఓ లెక్కనా అనుకుంటున్నారో ఏమో.. ఖర్చుకోసం ఏమాత్రం పార్టీలు వెనుకాడడం లేదు.
ఇక తెలంగాణ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల కూడా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలతో ముందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్లుగానే పీకీ టీం తెలంగాణలోకి ఎంట్రీ కాబోతోంది. ఈ నేపథ్యంలోన బుధవారం లోటస్ పాండ్‌లో షర్మిలతో పీకే టీం సభ్యులు సమావేశమయ్యారు. పార్టీ విస్తరణ, పాదయాత్ర, పార్టీ బలోపేతం తదితర అన్ని అంశాలపై ఈ టీంతో షర్మిల చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక నుంచి ప్రశాంత్‌కిషోర్ సలహాలతోనే షర్మిల అడుగులు వేస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత తాను ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోనని పీకే స్పష్టం చేశారు. ఐతే, అంతకుముందే, షర్మిలతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఆమె పార్టీతో పీకే బృందం పనిచేయబోతోందని సమాచారం.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉండగానే పార్టీతో ప్రజల్లోకి వెళ్లాలని షర్మిల ప్లాన్ చేస్తున్నారు. పార్టీ విధివిధానాలు, పార్టీ జెండా, అజెండా తదితరాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. షర్మిల అక్టోబరు 18న చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్రపై ఇప్పటికే పీకే టీంతో షర్మిల సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. పాదయాత్రలో ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో ఎలా ప్రచారం చేయాలనే దానిపై ఇప్పటికే పీకే టీం కసరత్తు చేసినట్లు సమాచారం. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికల ముందు చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఏపీలో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి ఘన విజయం కట్టబెట్టిన విజయం తెలిసిందే. వైసీపీ తరఫున ఐ-ప్యాక్ తమ ప్రచారాన్ని మే, 2017లో ప్రారంభించింది. 709 రోజులు తమ ప్రణాళికల్ని అమలు చేసింది. మొత్తం 17 ప్రధాన ప్రచార కార్యక్రమాలను నిర్వహించింది. అందులో 13 ప్రచార కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో నిర్వహించారు. ఐ-ప్యాక్ తన ప్రచారానికి మొదటి అస్త్రంగా క్షేత్ర స్థాయిలో వైసీపీ బూత్ క్యాడర్‌ని బలోపేతం చేసింది. అదే విధంగా పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తూ వారికి మార్గనిర్దేశం చేసింది. పక్కా ప్రణాళికతో సరైన వ్యూహాన్ని అమలు చేయడం వల్లే పార్టీ ఘన విజయం సాధించింది.
This post was last modified on September 29, 2021 5:53 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…