Political News

నొప్పించుకోకుండా.. ఒప్పించకున్న ఆర్కే – షర్మిల ‘ఓపెన్ హార్ట్’

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలు.. పాలిటిక్స్ మీద ఆసక్తి ఉన్న వారు.. న్యూస్ ను ఎక్కువగా ఫాలో అయ్యే వారంతా గడిచిన రెండు.. మూడు రోజులుగా ఒక ఆసక్తికర అంశం మీద విపరీతంగా మాట్లాడుకోవటమే కాదు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెర తీసింది ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే అలియాస్ రాధాకృష్ణ తన చానల్ లో తాను నిర్వహించే ‘ఓపెన్ హార్ట్’ సీజన్ 3 ను వైఎస్ షర్మిలతో షురూ చేయటం. ముందుగా వ్యక్తమైన అంచనాలకు భిన్నంగా.. సంచలనాలకు కాస్త దూరంగా.. ఇరువురు విన్ టు విన్ పాలసీని పక్కాగా ఫాలో అయినట్లుగా ఇంటర్వ్యూను అసాంతం చూసినంతనే అర్థమవుతుంది.

ఒకరిని ఒకరు నొప్పించుకోకుండా.. ఒప్పించకున్న తరహాలో ఈ రేర్ కాంబినేషన్ ఇంటర్వ్యూ సాగింది. ఇవాల్టి రోజున పొలిటికల్ ఇంటర్వ్యూలు అన్నంతనే స్పైసీగా ఉండటం.. ఇంటర్వ్యూ చేసే వారు చెలరేగిపోవటం.. ఇంటర్వ్యూ ఇస్తున్న వారు మహా చెలరేగిపోవటం.. ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకోవడం లాంటి ఛండాలాలకు దూరంగా.. ఇరువురు మర్యాదస్తుల మధ్య సాగిన చిట్ చాట్ మాదిరి ఈ ఇంటర్వ్యూ సాగిందని చెప్పాలి.

ఇంటర్వ్యూ మధ్యలో ఆర్కేలోని చిలిపి జర్నలిస్ట్ నిద్ర లేచి.. ఏదోలా జగన్ – షర్మిల మధ్య ఉన్న విభేదాల గురించి ఏదైనా కీ పాయింట్ చెప్పించేందుకు రెండు..మూడు సార్లు ప్రయత్నాలు చేసినా.. ఆర్కే కంటే ఆరు ఆకులు ఎక్కువ చదివిన చందంగా షర్మిల వ్యవహరించడంతో ఆయన ఎత్తు పారలేదు. అదే సమయంలో.. తాను అడిగిన ఒక ప్రశ్నకు దాని గురించి అయిపోయింది కదా అని షర్మిల అంటే.. సరే.. ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దామని ఆర్కే స్పందించిన తీరు చూస్తే.. షర్మిలను మరింత ఇబ్బంది పెట్టకూడదన్న విషయంలో ఆయన అప్రమత్తంగా ఉన్నారని చెప్పాలి.

ప్రతి పావుగంటకు ప్రకటనలకు విరామం ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ గంటన్నరకు పైనే సాగింది. దగ్గర దగ్గర రెండు గంటల సమయాన్ని తీసుకుంది. మరింత భారీ ఇంటర్వ్యూలో ఆర్కే అడిగిన టఫ్ ప్రశ్నలేంటి? షర్మిల చేసిన ఆసక్తికర వ్యాఖ్యలేమిటి? అన్న విషయంలోకి వెళితే..

వైఎస్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు జగన్ – షర్మిల వెళ్లడం.. ప్రేయర్ లో ఒకరికొకరు చూసుకున్నట్లు కూడా లేరు కదా అని ఆర్కే ప్రశ్నిస్తే.. ప్రేయర్ లో మాట్లాడుకోం కదా? కానీ ఆ తర్వాత విష్ చేసుకున్నాం.. కలిసి టిఫిన్ తిన్నామన్న విషయాన్ని షర్మిల చెప్పటం ద్వారా.. తమ మధ్య మాటలు ఉన్నాయన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. రాఖీ పండుగ రోజున తాను జగన్ కు ఫోన్ చేసి మాట్లాడినట్లుగా మరో సందర్భంలోనూ ఆమె చెప్పారు.

జగన్ తో తనకు విభేదాలు ఉన్న విషయాన్ని సూత్ర ప్రాయంగా అంగీకరించినా.. దాన్ని సమర్థించుకునేలా షర్మిల మాట్లాడటం గమనార్హం. మీ ఇంట్లో ఉండవా గొడవలు? అని ఆర్కేను అడిగేయటం.. ఇప్పటికైతే మా ఇంట్లో గొడవలు లేవన్న సమాధానాన్ని ఆయన ఇచ్చారు. మొత్తంగా అన్నా చెల్లెళ్ల మధ్య సమ్ థింగ్ తేడా ఉందన్న విషయాన్ని దాచుకోవటానికి షర్మిల పెద్దగా ప్రయత్నించలేదు. అదే సమయంలో జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది లేదు.

వైఎస్ పుష్కర వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి జగన్ ఎందుకు రాలేదన్న ప్రశ్నకు షర్మిల బదులిస్తూ.. ఆ రోజున ఏదో కార్యక్రమం ఉందని చెప్పినట్లు చెప్పారు.టీజర్ లో బాగా పాపులర్ అయిన ‘కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ పీక కాదు.. మెడ తీసేయగలడన్న’ సమాధానానికి అదనంగా.. రేవంత్ వల్ల అయ్యేదేమీ లేదన్నట్లుగా షర్మిల వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.

షర్మిల వ్యక్తిగత విషయాల్ని పంచుకుంటూ.. తన భర్త అనిల్ బ్రాహ్మణుడే అయినా.. నాన్ వెజ్ తింటారని.. తనకు ముక్క లేనిదే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబుద్ది కాదన్న షర్మిల.. తామిద్దరి పరిచయం హైదరాబాద్ లోని ఒక డాబాలో జరిగిందని.. అనిల్ ముందు ప్రపోజ్ చేశారని చెప్పారు. అనిల్ తో పెళ్లి విషయంలో తన తండ్రి తీవ్రంగా వ్యతిరేకించారని.. సర్దిచెప్పే ప్రయత్నం చేశారని.. చివరకు పెళ్లి చేసుకున్నామని చెప్పారు. మొత్తంగా తాను చాలా హ్యాపీగా ఉన్నానని.. ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్నట్లు చెప్పారు.

అక్టోబరులో పాదయాత్ర షురూ చేస్తానని.. ఏడాది పాటు సాగుతుందన్న ఆమె.. ప్రజలకు సేవ చేద్దామనుకున్నాం కదా? అదేదో ప్రజల మధ్యనే ఉంటే సరిపోతుంది కదా? అని తన ఫ్యూచర్ ప్లాన్ చెప్పేయటమే కాదు.. ప్రశాంత్ కిశోర్ త్వరలోనే రానున్నట్లు చెప్పారు. తన ప్రసంగాల్ని ప్రిపేర్ చేయటానికి ఒక టీం ఉందని.. పెద్ద ఎత్తున రీసెర్చ్ చేస్తారని పేర్కొన్నారు.

ఈ ఇంటర్వ్యూ ద్వారా షర్మిల తన అన్నకు ఏదైనా సంకేతం పంపారంటే.. అది ఆస్తుల్లో తనది సగం వాటా అన్నది ఆమె స్పష్టంగా చెప్పారు. తన తండ్రి ఉన్నప్పుడు మొదలు పెట్టిన అన్ని వ్యాపారాలు.. సగం ఉందని చెప్పారు. ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా? అంటే అలాంటిదేమీ లేదన్న ఆమె.. ఎక్కడికి పోతాయన్న ధీమాను వ్యక్తం చేశారు.

కేటీఆర్ ఎవరమ్మా? అని తాను అన్నది ఎటకారమేనని.. ఇంట్లో వ్రతాలు చేసుకొమ్మని అనటంతో కోపం వచ్చిందని.. వాళ్లు ఏమో ఫాంహౌస్ లో తాగి పడుకుంటారా? మమ్మల్ని వ్రతాలు చేసుకొమ్మని అంటారా? అంటూ అసలు విషయాన్ని చెప్పేశారు.

తన తండ్రికి అత్యంత సన్నిహితుడైన కేవీపీ సేవల్ని వినియోగించుకోవచ్చు కదా? అన్న ఆర్కే ప్రశ్నకు.. కాస్త జాగ్రత్తగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయగా.. మీ టీం మీది.. మీ నాన్న టీం నాన్నదన్న ఆర్కే మాటలకు విభేధిస్తూనే.. ఆయన ఇచ్చిన వివరణకు ఓకే చెప్పారు.

జగన్ ఫెయిల్యూర్లకు తానెందుకు బాధ్యత వహిస్తానని స్పష్టం చేసిన షర్మిల.. ఉదాహరణగా పిల్లల్ని పెంచి పెద్దవాళ్లను చేస్తాం.. వాళ్లు చేసే తప్పులకు మనమెందుకు బాధ్యులమవుతామన్న ఆమె మాట్లాడిన తీరు.. కన్వీన్స్ చేసే వైనం చూసినప్పుడు.. తాను వేసే ప్రతి అడుగు విషయంలో అప్రమత్తతతో పాటు.. పూర్తిస్థాయి అవగాహనతో షర్మిల ఉన్నారన్న భావన కలగక మానదు. మొత్తంగా నొప్పించక.. తానొవ్వక అన్న రీతిలో పరస్పర మర్యాద.. గౌరవాలు ఇచ్చుకునేలా షర్మిలతో ఆర్కే ‘ఓపెన్ హార్ట్ ’ సాగిందని చెప్పాలి.

This post was last modified on September 27, 2021 7:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

2 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

9 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

10 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

11 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

14 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

14 hours ago