రాజకీయాల్లో వేగం చాలా అవసరం. అదే సమయంలో పాదరసంలా వ్యవహరించాలి. చిక్కినట్లే చిక్కాలి కానీ చిక్కకుండా జారిపోవాలి. ఇలాంటి టాలెంట్ అందరు నేతల్లో కనిపించదు. ఇలాంటి టాలెంట్ ఉన్న నేతల్లో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాలో చాలానే ఉందని చెప్పాలి. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఆమెకు ప్రత్యర్థి పార్టీల్లోనే కాదు.. సొంత పార్టీలోనూ ప్రత్యర్థులు ఉన్నారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకించే వర్గం బలంగా ఉంటుంది. ఆమెను తరచూ చికాకు పెడుతూ ఉంటారు. అయినప్పటికీ.. మొండితనంతో ఆమె ముందుకు వెళుతూనే ఉంటారు.
ఏ చిన్న అవకాశం వచ్చినా ఇరుకున పెట్టేలా వ్యవహరించే అలాంటి బ్యాచ్ ల్లో ఒకదానికి నాయకత్వం వహించే చక్రపాణిరెడ్డి పుణ్యమా అని.. నిన్నటి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడటం తెలిసిందే. ఈ సందర్భంగా సాగిన రచ్చ తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. చక్రపాణి రెడ్డికి మంత్రి పెద్దిరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. వారిని మంత్రిగారు కంట్రోల్ చేస్తారన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలో.. నిండ్ర ఎంపీపీ ఎన్నిక విషయంలో రచ్చ చేసిన చక్రపాణి రెడ్డితోపాటు ఆయన వర్గంపైన చర్యల కత్తి ఝుళపాలన్న డిమాండ్ ను తీసుకున్న ఆర్కే రోజా.. ఈ రోజు అనూహ్యంగా మంత్రి పెద్దిరెడ్డి నివాసానికి వెళ్లిన వైనం ఆసక్తికరంగా మారింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ..ఆయన్ను.. ఆయన వర్గ నేతల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.
వైసీపీలో గ్రూపు రాజకీయాలు చేయటమంటే.. పార్టీ అధినేత జగన్ మాటను ధిక్కరించటమేనన్న ఆమె.. టీడీపీ నేతలతో చేతులు కలిపి పార్టీ పరువు తీయటానికి రోడ్డుపై ధర్నాలు చేయటమేమిటంటూ ప్రశ్నించారు. విప్ ను ధిక్కరించి పార్టీ వ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించకూడదన్న ఆమె.. ఎమ్మెల్యేలను.. పార్టీ నేతల్ని.. అధికారుల్ని బూతులు తిడుతున్న వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.
మంత్రి పెద్దిరెడ్డి ఇంటికి వచ్చే వేళ.. తనతో పాటు పూలబొకేను తీసుకొచ్చిన రోజా.. ఆయన మద్దతుదారులపై చర్యలు తీసుకోవాలని కోరిన వేళ.. ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఉత్కంటగా మారింది. మరోవైపు.. తమ వాదనను వినిపించేందుకు చక్రపాణి రెడ్డితోపాటు ఆయన వర్గీయులు సైతం మంత్రి పెద్దిరెడ్డిని కలవనున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం మంత్రి పెద్దిరెడ్డికి పరీక్షగా మారిందని చెప్పక తప్పదు.
This post was last modified on %s = human-readable time difference 7:16 am
కష్టపడితే అందలం ఎక్కించే టాలీవుడ్ పరిశ్రమలో దాన్ని సాధ్యం చేసుకునే వాళ్ళు కొందరే ఉంటారు. సరైన ప్లానింగ్ తో మంచి…
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క దర్శనం జరిగి ఏడాదికి పైగానే అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్లలో స్వీటీ…
ఇంకో పది రోజుల్లో నవంబర్ 14 విడుదల కాబోతున్న కంగువ మీద ఎన్ని అంచనాలున్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఏపీ, తెలంగాణలో…
చాలా గ్యాప్ తర్వాత ఒక వీకెండ్ మొత్తం థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడటం దీపావళికి జరిగింది. పెద్ద స్టార్…
మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు ఎంత నామమాత్రంగా ఉంటాయో తెలిసిందే. కథానాయికలకు మంచి గుర్తింపు ఉన్న పాత్రలు పది సినిమాల్లో…
ప్రస్తుతం సినిమాల స్కేల్ పరంగా ప్రభాస్ను అందుకునే హీరో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరూ లేరు. బాహుబలితో ఎవ్వరికీ సాధ్యం…