ఏపీలో మరో రగడ తెరమీదికి వచ్చింది. అది కూడా హిందూ ఆలయాలకు సంబంధించే కావడంతో ఇప్పు డు ఈ చర్చ జోరుగా సాగుతోంది. విషయం ఏంటంటే.. మరో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా దసరా శరన్నవ రాత్రులు ప్రారంభం కానున్నాయి. ఇది అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకునే రోజులు. అదే సమయంలో జాతరలు, ఉత్సవాలు కూడా చేసుకుంటారు. శక్తి స్వరూపిణిగా ప్రతి ఇల్లూ అమ్మ వారికి ఆహ్వానం పలుకుతుంది. అదే సమయంలో ఆలయాల్లో అయితే.. మరింత ఎక్కువగా నిత్య పూజలు, నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు.
అయితే.. మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా దసరా ఉత్సవాలపై ప్రభుత్వ వ్యూహాన్ని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ నవరాత్రులను ఇంటిలోనే నిర్వహించుకోవాలన్నారు. అంతేకాదు.. ఏ ప్రజాప్రతినిధీ కూడా అమ్మవారి ఉత్సవాలను బహిరంగంగా చేయాలని అనుకోవడం లేదని.. చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కరోనా ఉందని.. అమ్మవారికి కూడా ఈ విషయం తెలుసని అన్నారు. దీనిని బట్టి.. దసరా సరదా కూడా ఏపీ ప్రజలకు లేకుండా పోతోందన్న మాట.
వాస్తవానికి రాష్ట్రంలో వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత.. హిందూ ఆలయాలపై దాడులు జరిగాయనే వాదన ఉంది. దీనిపై అన్ని రాజకీయ పక్షాలు ఆందోళన నిర్వహించాయి. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం చర్య లు తీసుకుంటాం అన్నారే తప్ప.. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా రామతీర్థం విషయంలో చర్యలు ఏమయ్యాయో.. ఎవరికీ తెలియదు. ఇక, ఈ పరిస్థితి పక్కన పెడితే.. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా హిందువులను వేధిస్తున్నాయి. నిజానికి గత ఏడాది ఫుల్లుగా కరోనా ఉండడంతో హిందులకు సంబంధించి అనేక పండగలు, ఉత్సవాలు.. చేసుకునే పరిస్థితి లేకుండాపోయింది.
దీంతో ఈ ఏడాదైనా.. వాటిని అంతో ఇంతో ఘనంగా చేసుకునేందుకు ప్రజలు ముందుకు వచ్చారు. అయితే.. ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. నిన్న గా క మొన్న .. వినాయక చవితికి సంబంధించిన ఆంక్ష లు ప్రజల్లో ఆగ్రవేశాలు కలిగించాయి. పందిళ్లు వేసుకోవద్దని, గణపతి ఉత్సవాలు నిర్వహించవద్దని.. నిమజ్జన ఊరేగింపులు చేసుకోవద్దని ఆంక్షలు విధించింది.
దీంతో ఇతర పండగలకు లేని ఆంక్షలు ఒక్క హిందూ పండగలపైనేనా..అనే చర్చ జోరుగా సాగింది. అయితే.. హైకోర్టు కొంత మేరకు ఉపశమనం కల్పించినా.. పోలీసుల చర్యలతో ప్రజలు మనస్తాపానికి గురయ్యారు. అయితే.. ఏపీ ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా దసరాపై మరికొన్ని ఆంక్షలు విధిం చేందుకు రెడీ అయింది. మరి దీనిపై హిందూ సంస్థలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.
This post was last modified on September 26, 2021 1:00 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…