టీడీపీ శ్రీకాకుళం ఎంపీ.. యువ నాయకుడు.. కింజరాపు రామ్మోహన్ నాయుడు.. ఏపీ ప్రభుత్వంపైనా.. సీఎం జగన్‌పైనా నిప్పులు చెరిగారు. ఏపీని డ్రగ్గాంధ్రప్రదేశ్‌గా మార్చారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఎంపీ రామ్మోహన్.. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై నిప్పులు చెరిగారు. సీఎం జగన్ వైఖరితో .. యువత మత్తు పదార్థాలకు బానిసయ్యే ప్రమాదం పొంచిఉందని.. ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మాఫియాకు రాష్ట్రం.. కేంద్ర బిందువుగా మారడం బాధాకరమమని రామ్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.
పరిపాలన అంటే యువతకు హెరాయిన్ ఇవ్వడమా అని నిలదీశారు. 22 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన హెరాయిన్ వ్యవహారంలో ఏపీలో మూలాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయని.. వైసీపీకి సంబంధించిన వ్యక్తిని అరెస్టు చేశారని.. దీనికి వైసీపీకి మధ్య ఉన్న సంబంధాల్లో వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. డీజీపీ ఏమీ లేదని చెప్పడం.. బాధ్యతారాహిత్యం కాదా? అని నిలదీశారు. ఆశా ట్రేడింగ్ కంపెనీ ఎవరి పేరుతో నమోదైందో చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. డీజీపీ సహా రాష్ట్ర పోలీసులు ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తున్నారని.. ఈ విషయంలో డీజీపీనే స్వయంగా స్పష్టత ఇవ్వాలని ఎంపీ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారో.. చెప్పాలన్నా రు. 2020 నేర గణాంకాల లెక్కల ప్రకారం మహిళలపై బౌతిక దాడులు జరుగుతున్న రాష్ట్రాల్లో దేశంలో ఏపీ నెంబర్ 1గా ఉందన్నారు. ఏదో చేస్తారని.. జగన్‌కు ప్రజలు అధికారం అప్పగిస్తే.. మహిళలపై దాడులు జరుగుతున్నా.. చూస్తూ ఊరుకున్నారు.
యువతకు హెరాయిన్ ఇస్తున్నారు.. అన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని.. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారా అని నిలదీశా రు. యువతకు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ప్రతి పక్షాలకు ప్రశ్నించే హక్కు లేదా అని ఎంపీ రామ్మోహన్ నిలదీశారు.
This post was last modified on September 25, 2021 2:27 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…
విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…