ఆంధ్రజ్యోతి ఆర్కేను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. దమ్మున్న చానల్ ట్యాగ్ తో.. చానల్.. సంచలన కథనాలతో దినపత్రికను నడిపే ఆయన.. సొంతంగా ప్రతి వారం తన పేపర్లో ‘కొత్త పలుకు’ పేరుతో పొలిటికల్ కాలమ్ ఒకటి రాస్తుంటారు. ఇదే కాకుండా.. చానల్ వరకు వస్తే.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే పేరుతో సెలబ్రిటీలను కాస్త భిన్నమైన కోణంలో ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఇప్పటికే ఈ ప్రోగ్రాంకు ఆదరణ ఎక్కువే. రెండు సీజన్లు నడిచిన ఈ ప్రోగ్రాంను.. ఆర్కే వ్యక్తిగత కారణాలతో పక్కన పెట్టినట్లు చెబుతారు.
తాజాగా మూడో సీజన్ కు ఆయన సిద్ధం కావటం.. మొదటి హోస్టుగా దివంగత మహానేత వైఎస్ షర్మిలతో కావటం పెను సంచలనంగా మారింది. ఉప్పునిప్పులా ఉండే ఆంధ్రజ్యోతి ఆర్కేకు.. వైఎస్ కుటుంబానికి మధ్య మాటలే కానీ మాట్లాడుకోవటాలు ఇప్పటివరకు లేనిది. అలాంటిది అందుకు భిన్నంగా ఆర్కే షోకు షర్మిల రావటం.. దానికి సంబంధించిన టీజర్ ఇప్పుడు సంచలనంగా మారింది.
షర్మిలతో ఇంటర్వ్యూ అంశం ఈ మధ్యన బయటకు వచ్చినా.. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన టీజర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ ఆదివారం రాత్రి సదరు చానల్ లో టెలికాస్టు కానుంది. అంచనాలకు తగ్గట్లే.. మసాలను కూరి మరి టీజర్ ను సిద్ధం చేశారు. తాను జగనన్న బాణాన్ని అన్న షర్మిల మాట ఎంత ఫేమస్సోతెలిసిందే. సరిగ్గా.. అదే మాట తాజా ఇంటర్వ్యూలో షర్మిల నోటి నుంచి మారటం గమనార్హం. తానుఎవరి బాణాన్నీ కాదని.. తాను రాజన్న బిడ్డను అంటూ ఆమె చెప్పిన మాట ఇప్పుడుఆసక్తికరంగా మారింది.
తాజాగా విడుదల చేసిన టీజర్ లో షర్మిల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం అవసరమైనప్పుడల్లా.. అడిగిందల్లా శక్తికి మించి చేశా’ అంటూ ఒక సందర్భంలో.. ‘ప్రత్యామ్నాయం లేకపోవటం వల్లనే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు’ అని మరో సందర్భంలో షర్మిల కామెంట్ చేయగా..ఈ అన్నాచెల్లెళ్ల మధ్య ఎక్కడ చెడిందన్న విషయానికి సంబంధించి కాస్త టిప్ అందించినట్లుగా టీజర్ లో చెప్పించారు.
“సంబంధం లేదని సజ్జల రామక్రిష్ణారెడ్డన్న అనడం బాధ కలిగించింది’ అంటూ షర్మిల మాటలు ఇప్పుడుహాట్ టాపిక్ గా మారటమే కాదు.. మోస్ట్ అవేటింగ్ ఇంటర్వ్యూగా ఇప్పుడు మారింది. కచ్ఛితంగా ఈ ఇంటర్వ్యూ రాజకీయ సంచలనంగా మారటమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చలకు తెర తీస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఈ టీజర్ సంచలనంగా మారి దుమ్ము రేపుతోంది. మరో రోజున్నరలో టెలికాస్ట్ కానున్న ఈ ఇంటర్వ్యూ మరెన్ని హాట్ టాపిక్ లను తెర మీదకు తీసుకొస్తుందో?
This post was last modified on September 25, 2021 11:03 am
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…