రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోవాలంటూ టీడీపీ నేతల నుంచి డిమాండ్లు మొదలైపోయాయి. తాజాగా వెల్లడైన పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని మండలాల్లో టీడీపీ-జనసేన కలుస్తున్న విషయం తెలిసిందే. స్ధానికంగా ఎదురైన పరిస్థితుల కారణంగా రెండు పార్టీలు అవగాహనతో సర్దుబాట్లు చేసుకుంటే మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవిని ఈ రెండు పార్టీలు తమ ఖాతాలో వేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు స్థానిక నేతలు గట్టిగా కసరత్తు చేస్తున్నారు.
రెండు పార్టీలు గనుక కలిస్తే సుమారు ఎనిమిది మండలాల్లో ప్రెసిడెంట్ పదవికి అధికార వైసీపిని దూరంగా పెట్టవచ్చు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, కడియం, మలికిపురం, పశ్చిమగోదావరి జిల్లాలోని వీరవాసరం, ఆచంట, కృష్ణా జిల్లాలోని చల్లపల్లి, మోపిదేవి, కడప జిల్లాలోని గోపవరం మండలాల్లో వైసీపీ గెలిచిన ఎంపీటీసీ స్థానాల కన్నా టీడీపీ, జనసేనలు గెలుచుకున్న ఎంపీటీసీ స్థానాలు ఎక్కువ. కాబట్టి తమ రెండు పార్టీలు కలిస్తే బాగుంటుందని టీడీపీ నేతలు బహిరంగంగానే చంద్రబాబునాయుడును డిమాండ్ చేస్తున్నారు.
మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ-జనసేనలు పొత్తులు పెట్టుకోవాలని చంద్రబాబుకు సూచించారు. తమ రెండు పార్టీలు కలిస్తే వైసీపీ మీద గెలవచ్చని తాజా ఫలితాల్లో అర్ధమైనట్లు చెప్పారు. విడివిడిగా పోటీ చేసి ఫలితాల తర్వాత కలవటం కన్నా ముందే పొత్తుంటే ఇంకా బాగుంటుందని పితాని చెప్పారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఇపుడే పొత్తులపై రెండు పార్టీల అధినేతలు భేటీ జరిపి నిర్ణయం తీసుకోవాలని పితాని డిమాండ్ చేశారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ-జనసేనలు మిత్రపక్షాలైనా ఎంపీపీ అధ్యక్ష పదవుల కోసం జనసేన-టీడీపీలు కలుస్తున్నాయి. అధినేతల స్ధాయిలోనే కాదు చివరకు క్రింది స్థాయిలో కూడా బీజేపీ-జనసేన పొత్తు ఎవరికీ ఇష్టంలేనట్లుంది. అందుకనే ఎవరికి వారుగా కార్యక్రమాలను చేసుకుంటున్నారు. అవసరమైనపుడు మాత్రమే ఏదో మొక్కుబడిగా బీజేపీ నేతలతో జనసేన నేతలు కలుస్తున్నారన్న విషయం అందరికీ అర్ధమవుతోంది.
తాజా పరిషత్ ఫలితాల్లో బీజేపీ 28 ఎంపీటీసీల్లో గెలిస్తే జనసేన 177 ఎంపీటీసీల్లో గెలిచింది. టీడీపీ 917 ఎంపీటీసీల్లో గెలిచింది. దీంతో టీడీపీ-జనసేన గెలిస్తే ఇంకా మంచి ఫలితాలు వచ్చుండేదనే చర్చ, ఆశ రెండుపార్టీల్లోను పెరిగిపోతోంది. దీన్ని గమనించే జనసేనతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ నేతల నుండి డిమాండ్లు మొదలైపోయాయి. బహుశా పవన్ కల్యాణ్ కు కూడా ఇదే కావాలేమో. చూద్దాం తొందరలోనే పొత్తులపై అనూహ్య ప్రకటన వస్తుందేమో.
This post was last modified on September 25, 2021 10:40 am
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…