Political News

ఢిల్లీ కోర్టులో కాల్పులు.. గ్యాంగ్‌స్ట‌ర్ స‌హా న‌లుగురు మృతి

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. అది కూడా ఢిల్లీలోని స్థానిక రోహిణి కోర్టులో ఈ కాల్పు లు జ‌ర‌గ‌డం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ కాల్పుల్లోమొత్తం.. న‌లుగురు మృతి చెందారు. వీరిలో క‌ర‌డు గ‌ట్టిన గ్యాంగ్ స్ట‌ర్ కూడా ఉండ‌డం.. గ్యాంగ్ స్ట‌ర్ కేంద్రంగానే కాల్పులు జ‌ర‌గ‌డం .. ప్రాధాన్యం సంతించుకుంది. మ‌హారాష్ట్రంలో అత్యాచారాలు, దోపిడీల‌కు సంబంధించి జితేంద్ర గోగిపై 19 కేసులు న‌మోదయ్యాయి. ఈ క్ర‌మంలో జితేంద్ర‌కు ఢిల్లీలో కూడా లింకులు ఉండ‌డంతో అత‌నిపై విచార‌ణ రోహిణి కోర్టులో జ‌రుగుతోంది.

ఈ క్ర‌మంలో శుక్ర‌వారం ఉద‌యం గోగిని.. పోలీసులు కోర్టులో హాజ‌రు ప‌రిచారు. ప్ర‌త్యేక విభాగం పోలీసులు ఈ కేసును ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అయితే.. రోహిణీ కోర్టులో జితేంద్ర‌ను హాజ‌రు ప‌రిచిన కొద్దిసేప‌టికే.. కొంద‌రు దుండ‌గులు.. న్యాయ వాదుల దుస్తుల్లో కోర్టులోకి ప్ర‌వేశించారు. వాస్త‌వానికి.. ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త ఉన్న రోహిణి కోర్టులోకి దుండ‌గులు ఎలా ప్ర‌వేశించార‌న్న విష‌యంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. వ‌చ్చీరావ‌డంతోనే.. జితేంద్ర ల‌క్ష్యంగా కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లోగ్యాంగ్ స్ట‌ర్ గోగి.. ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. అత‌ను అక్క‌డ‌ మృతి చెందాడు.

ఇక‌, వెంట‌నే తేరుకున్న పోలీసులు.. ఎదురు కాల్పుల‌కు దిగారు. పోలీసు కాల్పుల్లో ముగ్గురు దుండ‌గులు ప్రాణాలు విడిచారు. జితేంద్ర గోగీని వివిధ నేరాల‌ కింద 2020లో అటు మ‌హారాష్ట్ర‌, ఇటు ఢిల్లీ పోలీసులు కేసులు న‌మోదు చేశారు. ఈ క్ర‌మంలో ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం అరెస్ట్ చేసింది. అతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి జైలులో ఉంచారు.

శుక్రవారం పోలీసులు, 3వ బెటాలియన్ దళాలు గోగీని రోహిణి కోర్టుకు తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే దుండగులు 127 రూంలో జ‌రుగుతున‌న విచార‌ణ గ‌దిలోకి న్యాయ వాద దుస్తుల్లో వ‌చ్చి కాల్పులు జ‌ర‌గ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. కాగా, కాల్పుల‌కు గ్యాంగ్ వారే కార‌ణ‌మ‌ని.. ఢిల్లీ పోలీసులు ప్రాథ‌మికంగా నిర్దారించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 24, 2021 2:58 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

7 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

8 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

11 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

11 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

12 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

12 hours ago