తొందరలోనే మరో పాదయాత్ర మొదలవ్వబోతోంది. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 20వ తేదీనుండి తన పాదయాత్ర మొదలవుతుందన్నారు. చేవెళ్ళ నియోజకవర్గం నుండి మొదలయ్యే పాదయాత్ర 90 నియోజకవర్గాల్లో సాగుతుంది. చేవెళ్ళల్లో మొదలయ్యే పాదయాత్ర అన్నీ నియోజకవర్గాలు తిరిగి చివరకు మళ్ళీ చేవెళ్ళలోనే ముగుస్తుంది. కేసీయార్ పాలనకు వ్యతిరేకంగా జనాలను చైతన్యవంతులను చేయటమే ధ్యేయంగా పాదయాత్ర ఉంటుందన్నారు.
చేవెళ్ళ నుండే పాదయాత్ర ఎందుకు మొదలవ్వబోతోందంటే సెంటిమెంట్ అనే చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూడా 2003కు ముందు రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. అప్పుడు వైఎస్ కూడా చేవెళ్ళ నియోజకవర్గం నుండే ప్రారంభించారు. ఆ పాదయాత్ర కారణంగానే చేవెళ్ళలో అప్పటి కాంగ్రెస్ నేత ఇప్పటి టీఆర్ఎస్ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ‘చేవెళ్ళ చెల్లమ్మ’ అనే పేరు పాపులరైంది. ఇపుడు షర్మిల కూడా తన తండ్రి అడుగుజాడల్లోనే పాదయాత్రను మొదలుపెట్టి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
సరే షర్మిల పాదయాత్ర విషయానికి వస్తే అప్పటి వైఎస్సార్ లాగే ఇపుడు షర్మిల కూడా ఉనికి కోసమే పాదయాత్ర చేయబోతున్నారు. అప్పట్లో పార్టీలో వైఎస్ పరిస్ధితి అగమ్యగోచరంగా ఉండేది. దాంతో తన కెపాసిటి ఏమిటో చాటి చెప్పేందుకు, ప్రత్యర్ధులపై పైచేయి సాధించేందుకే వైఎస్ పాదయాత్ర ప్రారంభించారు. అదృష్టంకొద్దీ వైఎస్ వ్యూహం క్లిక్కవటంతో పార్టీలో తిరుగులేని నేతగా ఎదగటమే కాకుండా తర్వాత సీఎం కూడా అయిపోయారు.
అదే ఒరవడిని ఇపుడు షర్మిల కూడా అనుసరించాలని డిసైడ్ అయినట్లే ఉన్నారు. ఇపుడు షర్మిల కూడా ఉనికి కోసమే తెలంగాణాలో అవస్తలుపడుతున్నారు. షర్మిలను అందరు సీమాంధ్ర వ్యక్తిగానే చూస్తుంటే తాను మాత్రం తెలంగాణా ఆడబడుచునే, తెలంగాణా కోడలినే అంటున్నారు. ఇక్కడ తెలంగాణానా లేకపోతే ఏపీనే అనేది కాదు ముఖ్యం. జనాలు ఆదరిస్తే ఏ ప్రాంతంవారైనా పదవులు అందుకోవచ్చు.
కాబట్టి అదే హోప్ తో షర్మిల కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటికైతే వైఎస్సార్టీపీని జనాలు పెద్దగా పట్టించుకోవటంలేదన్నది వాస్తవం. ప్రజలే కాదు చివరకు రాజకీయపార్టీలు కూడా షర్మిలను అసలు లెక్కేచేయటంలేదు. అందుకనే నిరుద్యోగ సమస్యలపై నిరాహారదీక్షలంటు నానా అవస్తలు పడుతున్నారు. రేపటి పాదయాత్రతో షర్మిల భవిష్యత్తు ఏమిటో ఓ విధంగా తేలిపోతుంది. పాదయాత్రలో జనాలు గనుక షర్మిలను ఆదరిస్తే పర్వాలేదు. లేకపోతే మొగ్గ దశలోనే ఓ పార్టీ వాడిపోయినట్లనుకోవాలి.
This post was last modified on September 21, 2021 10:10 am
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…