Political News

స్టాలిన్ గతం ఇప్పటివారెందరికి తెలుసు?

సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండి కూడా సీఎం పదవిని చేపట్టేందుకు 68 ఏళ్ల వయసు వరకూ వెయిట్ చేయాల్సి రావటం ఆయనకు మాత్రమే చెల్లుతుందేమో? తండ్రి కోసం తన రాజకీయాల్ని త్యాగం చేసిన కొడుకుగా.. ఓపికకు.. నిదానానికి నిలువెత్తు రూపంగా నిలుస్తారు. రాజకీయాల్లోకి వచ్చి.. అమేయమైన ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న వారంతా.. ఎంత త్వరగా సీఎం కుర్చీలో కూర్చోవాలని తపిస్తారు. కానీ.. స్టాలిన్ మాత్రం అందుకు భిన్నం. 1984లో తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసిన ఆయన.. ఓటమిపాలయ్యారు. 1989లో ఎంజీఆర్ మరణం తర్వాత.. మళ్లీ స్టాలిన్ ఎమ్మెల్యే అయ్యారు. రాజకీయ జీవితంలో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవటం స్టాలిన్ కు మొదట్నించి అలవాటైన విషయమే.

2016 ఎన్నికల్లో కాస్తంత రాజీ పడి.. ప్రత్యర్థి పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేల్ని తీసుకుంటే నాలుగేళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నా.. అలాంటి పనికి నో అంటే నో చెప్పటమే కాదు.. అధికారాన్ని ప్రజలే అప్పజెప్పాలన్న వాదనను వినిపించారు. అది ఇపుడు చేతల్లో చేసి చూపించిన సత్తా స్టాలిన్ సొంతం. 68 ఏళ్ల వయసులోనూ ఫిట్ గా ఉంటూ.. అందరిని ఆకర్షించే ఆయన.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న మూడు నెలలకే ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలవటం స్టాలిన్ కే సాధ్యమవుతుందేమో?

దీనికి కారణం.. అధికారం చేతికి వచ్చిందన్న అహంకారం ఇసుమంతైనా లేకపోవటమే. అధికారాన్ని కేవలం ఆభరణంగా మాత్రమే చూస్తూ.. ప్రజా సేవలో మునిగిపోవటం అందరికి సాధ్యమయ్యేది కాదని చెప్పాలి. ఇప్పుడు ఇంతమంది చేత పొడిగించుకుంటున్న స్టాలిన్.. ఇక్కడి వరకు చేరటానికి రాజకీయ ప్రత్యర్థులతో మాత్రమే కాదు.. అయినోళ్లతోనూ పోరాడాల్సి వచ్చింది. తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆయన రాజకీయ రంగ ప్రవేశం.. ఎన్నో సవాళ్లతో కూడుకున్నది కావటం గమనార్హం.

ఇవాల్టి రోజున స్టాలిన్ ను తెగ పొగిడేసే వారు.. ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఎదురుదెబ్బల గురించి అవగాహన లేనోళ్లు కూడా చాలామందే ఉంటారు. ఆయన ఎంతటి కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నారనటానికి రెండు ఉదంతాలు సరిపోతాయి. దేశ వ్యాప్తంగా ఇందిర సర్కారు అత్యవసర పరిస్థితిని విధించిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కరుణ సర్కారును రద్దు చేసేశారు. ఆ పార్టీకి చెందిన నేతల్ని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే సీఎం కుమారుడు స్టాలిన్ ను కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు ఇంటికి వెళ్లారు.

తన కొడుకు బయట ఊరికి వెళ్లాడని.. తిరిగి రాగానే అప్పగిస్తామని చెప్పిన కరుణ.. పార్టీ ప్రచారానికి వెళ్లి వచ్చిన స్టాలిన్ ను పోలీసులకు అప్పగించారు. ఆయన్ను ఎక్కడికి తీసుకెళుతున్న విషయాన్ని పోలీసులు సమాచారం ఇవ్వకపోవటమే కాదు.. రోజంతా జీపులో తిప్పి.. అర్థరాత్రి చెన్నై సెంట్రల్ జైలులోని ప్రత్యేక సెల్ లోకి తీసుకెళ్లారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అన్న విషయాన్ని వదిలేసి.. వయసులో చిన్న కుర్రాడు.. అప్పుడే పెళ్లైన వాడన్న విషయాన్ని వదిలేసి.. బట్టలూడదీసి మరీ లాఠీలతో చితకబాదారు.

తానిక పార్టీ కోసం పని చేయనని రాసి ఇవ్వాలని పోలీసులు అడిగితే.. అందుకు ససేమిరా అని స్టాలిన్ బదులివ్వటంతో.. పోలీసులు తమ కౌర్యానికి కొత్త కోరలు తొడిగారు. జైలులోని సీనియర్ ఖైదీలతో కొట్టించారు. ఇనుపబూట్లు తొడిగి మరీ కొట్టించారు. అలా ఒకరు స్టాలిన్ కుడి చేతిని తొక్కి.. భుజం దాకా ఇనుప బూటు లాగటంతో.. అంగుళం మందాన కండ లేచి బయటకు వచ్చింది. ఈ దారుణాన్ని అడ్డుకోబోయిన మరో ఖైదీ.. డీఎంకే నేతను పోలీసులు బలంగా కొట్టటంతో ఆయన చనిపోయాడు.

అతను చనిపోయిన తర్వాత హింస కాస్త తగ్గినప్పటికీ..జైల్లో వేధింపులు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయని చెబుతారు. రోజుకోసారి గంజినీళ్లు ఇచ్చి.. వాటిని తాగుతున్నప్పుడు మట్టిపోయటం లాంటి పనులెన్నో చేసేవారు. అరెస్టు చేసిన నెల రోజుల తర్వాత స్టాలిన్ ను చూడటానికి తల్లికి.. భార్యకు అనుమతి ఇచ్చారు. వాళ్లు చూసి వచ్చిన కొద్దిరోజులకే స్టాలిన్ కు తీవ్రంగా వాంతులు కావటంతో ఆసుపత్రికి తరలించారు. అపెండిసైటిస్ అని తేల్చిన వైద్యులు… అతనికి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలంటే అందుకు అధికారులు ఒప్పుకోలేదు. చివరకు వైద్యులు తప్పనిసరి అని చెప్పటంతో ఆసుపత్రిలో చేర్చారు.

సర్జరీ జరిగిన గంట సేపటికే జైలుకు తీసుకెళ్లిన కౌర్యం పోలీసులది. అలా దిన దిన గండంగా ఏడాది పాటు జైల్లో గడిపిన ఆయన బయటకు రాగానే.. పార్టీ కార్యకర్తలంతా ఆయన్నో స్టార్ గా చూడటం.. ఆయనకు పార్టీ జనరల్ కౌన్సిల్ లో చేర్చేందుకు పార్టీ నేతలు డిమాండ్ చేస్తే.. అందుకు అభ్యంతరం చెప్పింది స్టాలిన్ తండ్రి కరుణ అయితే.. అందుకు మద్దతు పలికింది మాత్రం స్టాలిన్ తల్లి దయాళు.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తీవ్రమైన ప్రతికూలతలు ఎదురయ్యాయి. అది కూడా సొంత అన్న చేతిలోనే. ఈ కారణంతోనే 1989లో ఎమ్మెల్యేగా స్టాలిన్ గెలిచినప్పటికీ ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. 1996లోనూ డీఎంకే అధికారంలో ఉండి.. కరుణ సీఎం అయ్యాక కూడా స్టాలిన్ కు పదవిని ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో తనను తాను నిరూపించుకోవటానికి చెన్నై మేయర్ గా బరిలోకి నిలిచి.. గెలవటమే కాదు.. ది బెస్ట్ మేయర్ ప్రశంసల్ని అందుకున్నారు. 2001లో రాష్ట్రమంతా డీఎంకే ఓడినా.. చెన్నై నగరంలో మాత్రం తానే మేయర్ గా గెలిచారు. అయితే.. జయలలిత ఆడిన రాజకీయ క్రీడలో మేయర్ పదవిని కోల్పోయారు. అరెస్టు అయ్యారు. అప్పటి నుంచి జయలలితను నేరుగా ఢీ కొనటం షురూ చేశారు.
అలా కిందా మీదా పడుతూ తనను తాను ఫ్రూవ్ చేసుకున్న తర్వాత కానీ 2006లో స్టాలిన్ ను మంత్రివర్గంలో తీసుకుంటూ కరుణ తన నిర్ణయాన్ని ప్రకటించారు. డిప్యూటీ సీఎంగానే ప్రకటించారు. దీనికి తన సోదరుడు అళగిరికి నచ్చకపోవటం.. తిరుగుబాటు బావుటా ఎగురవేయటంతో 2011.. 2016లో రెండుసార్లు జయలలిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం.. డీఎంకే విపక్షంలో ఉండిపోవాల్సి వచ్చింది. రెండోసారి అధికారాన్ని చేపట్టిన కొద్ది నెలలకే అనూహ్యంగా అనారోగ్యానికి గురైన జయ.. ఆసుపత్రిలో మరణించారు.

ఇలాంటి వేళ అధికార అన్నాడీఎంకే రెండుగా చీలినప్పటికీ.. ఆ చీలికను తన రాజకీయ ఉన్నతికి వాడుకోకుండా.. ప్రజలు తమను ఎన్నుకునే వరకు వెయిట్ చేశారు. 2018లో తండ్రి కరుణ మరణించటంతో పార్టీ పగ్గాలు చేపట్టిన ఆయన 2109లో జరిగిన లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి.. 2021 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూసిన సీఎం సీట్లో కూర్చున్నారు. తన రాజకీయ జీవితంలో ఎదురైన డక్కామొక్కీల కారణంతో రాటు తేలిన స్టాలిన్.. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు దేశ వ్యాప్తంగా చర్చగా మారటమే కాదు.. ఆయనపై కొత్త అంచనాలు వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. మరేం జరుగుతుందో కాలమే డిసైడ్ చేయాలి.

This post was last modified on September 23, 2021 1:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అవినాష్‌రెడ్డికి మ‌రో చిక్కు.. ఇక‌, బీటెక్ రెడ్డి వంతు!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్ప‌టికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒక‌వైపు బాబాయి వివేకానంద‌రెడ్డి దారుణ…

2 hours ago

కూట‌మి క‌ల‌కాలం.. తేల్చేసిన చంద్ర‌బాబు!

క్షేత్ర‌స్థాయిలో టీడీపీ నాయ‌కుల‌కు, ఎన్డీయే కూట‌మిలో ఉన్న జ‌న‌సేన‌, బీజేపీ నాయ‌కుల‌కు మ‌ధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…

4 hours ago

రాజాసింగ్…క‌న‌బ‌డుట‌లేదు!

రాజాసింగ్‌... రాజ‌కీయాల ప‌ట్ల క‌నీస ప‌రిచ‌యం ఉన్న‌వారికి ఎవ‌రికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి  కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు.…

4 hours ago

ఎంపీ అవినాష్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు?

వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…

7 hours ago

నయన్‌పై ధనుష్ ఫ్యాన్స్ కౌంటర్ ఎటాక్

ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…

7 hours ago