ఎంతో ఆర్భాటంగా ప్రకటనలు చేసి, ప్రచారం చేస్తున్న దళితబంధు లబ్దిదారులకు కేసీయార్ ప్రభుత్వం పెద్ద షాకిస్తోంది. దళితబంధు పథకం పెట్టడం ద్వారా రాష్ట్రంలోని దళితులందరినీ ఉద్దరించేస్తున్నట్లు కేసీయార్, కేటీయార్, హరీష్ రావు అండ్ కో ఒకటే ఊకదంపుడు ప్రచారం చేసుకుంటున్నారు. పథకంలో భాగంగా ఇప్పటికే కొందరు దళితులను గుర్తించి రు. 10 లక్షలు వాళ్ళు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కూడా జమచేశామని చెప్పుకుంటున్నారు. అయితే డబ్బులు జమైతే అవుతున్నాయి కానీ తర్వాత ఏమి జరుగుతుందో అర్ధం కావటంలేదు.
ఎందుకంటే డబ్బులు పడిన కొందరి ఖాతాలు వెంటనే ఫ్రీజైపోతున్నాయంట. అంటే డబ్బులు పడిన రెండు మూడు రోజులకే మళ్ళీ ఖాతాల్లో నుండి డబ్బులు వాపసు వెళ్ళిపోవటమే లేకపోతే ఖాతాలు స్తంబించేయటమో జరుగుతోందట. ఇదికూడా తొందరలోనే ఉపఎన్నిక జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే కావటం గమనార్హం. నిజానికి దళితబంధు పథకం కేవలం ఎన్నికల్లో గెలవటం కోసం ఉద్దేశించి తెచ్చిందనటంలో ఎలాంటి సందేహంలేదు. సరే పథకాన్ని ఏ ఉద్దేశ్యంతో తెచ్చినా లబ్దిదారులకు ఉపయోగపడితే అంతేచాలు. అందుకనే నియోజకవర్గంలో సుమారు 25 వేలమంది ఎస్సీలున్నట్లు ప్రభుత్వం తేల్చింది. వీళ్ళందరికీ విడతలవారీగా డబ్బులు వేస్తామని ప్రభుత్వం చెప్పింది.
ఆగష్టు 16వ తేదీన పథకాన్ని ప్రారంభించిన కేసీయార్ అదేరోజు 15 మంది ఖాతాల్లో డబ్బులేశారు. తర్వాత నియోజకవర్గంలోని అన్నీ ఐదుమండలాల్లో సర్వేచేసి 21 వేలమంది అర్హులైన పేదలున్నట్లు తేల్చారు. వీరిలో సుమారు 14 వేలమంది ఖతాల్లో తలా రు. 10 లక్షల చొప్పున డబ్బులు కూడా పడ్డాయి. ఇంతవరకు ఎలాంటి సమస్యాలేదు. సమస్యంతా తర్వాతే మొదలైంది. కొద్దిరోజులుగా ఖాతాలో పడిన డబ్బు పడినట్లే మళ్ళీ వాపసు అయిపోతున్నట్లు ఖాతాదారుల మొబైళ్ళకు మెసేజులు వస్తున్నాయట.
దాంతో అసలేం జరుగుతోందో లబ్దిదారులకు అర్ధం కావటంలేదు. ఒక్క కమలాపూర్ మండలంలోనే 160 మంది లబ్దిదారుల ఖాతాల్లో నుండి డబ్బులు వాపసు వెళ్ళిపోయినట్లు సమాచారం. వృద్ధులు, ఒంటరి మహిళలు, కూరగాయలు, పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారుల ఖాతాల్లో పడిన డబ్బంతా తిరిగి వెనక్కు వెళ్ళిపోతున్నట్లు చెబుతున్నారు. ఎందుకిలా జరుగుతోందంటే వాళ్ళ ఖాతాల్లో డబ్బులేసినా రేపటి ఎన్నికల్లో పెద్దగా ఉపయోగం ఉండదనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.
కమలాపూర్ మండలంలోని ఒప్పుల ప్రమీల మాట్లాడుతు తన ఖాతాలో ఈనెల 3వ తేదీన రు. 9.9 లక్షలు పడినట్లు మెసేజ్ వచ్చిందన్నారు. అయితే 6వ తేదీన అంటే మూడు రోజుల తర్వాత ఆ డబ్బులు మళ్ళీ వాపసు వెళ్ళిపోయినట్లు మరో మెసేజ్ వచ్చిందని చెప్పారు. బ్యాంకుకు వెళ్ళి అడిగితే తమకేమీ తెలీదని బ్యాంకు అధికారులు చెప్పినట్లు ప్రమీల చెప్పారు. ప్రభుత్వ అధికారులను అడిగినా ఏమీ సమాధానం చెప్పటం లేదన్నారు. ఖాతాలో డబ్బులు పడినందుకు సంతోషించాలో వాపసు వెళ్ళిపోయినందుకు ఏడ్వాలో కూడా తెలీటం లేదన్నారు. మొత్తంమీద దళితబంధు పథకం, లబ్దిదారుల వ్యవహారమంతా గందరగోళంగా తయారవుతోందనటంలో సందేహంలేదు.
This post was last modified on September 18, 2021 8:49 am
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…
తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…
కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ఫౌజీ టైటిల్…
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాలకు కాస్తంత గ్యాప్ ఇచ్చినట్టే కనిపిస్తున్నారు. ఈ సంక్రాంతికి డాకు…