ఏపీ రాజకీయాలు ఎటు పోతున్నాయి? విమర్శలు, ప్రతి విమర్శలకు పరిమితం కావాల్సిన.. నాయకులు.. సంచలనాలకు.. బ్రేకింగులకు ఇస్తున్న ప్రాధాన్యం.. చివరకు దాడులకు.. దారితీస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. సహజంగా ప్రతిపక్ష నాయకులు.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తారు. ఇది ప్ర జాస్వామ్యంలో వారికి ఉన్న హక్కు. అయితే.. ఈ విమర్శలు కొన్నాళ్లుగా శృతి మించుతున్నాయి. నిబద్ధత కొరవడిన రాజకీయాల్లో.. పనిచేయడం వల్ల వచ్చే గుర్తింపును పక్కన పెట్టి.. సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా వచ్చే గుర్తింపు.. మెప్పుల కోసం.. నాయకులు తెగబడుతున్నారు.
సాధారణంగా ఒకప్పుడు.. అధికార పార్టీపై చేసే విమర్శలు.. ఒకింత ఆలోచనాత్మకంగా ఉండేవి. అయితే.. టీడీపీలో ఇటీవల కాలంలో.. అసహనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నుంచి లోకేష్ వరకు అందరూ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలే చేస్తున్నారు. ప్రభుత్వాన్ని తాలిబాన్లతో పోల్చడం.. మాఫియాతో పోల్చడం.. సర్వ సాధారణంగా మారిపోయింది. ఇలా మాట్లాడితే.. తప్ప.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. తప్ప తమకు .. తమ కార్యక్రమాలకు మీడియాలో కవరేజీ రాదని భావిస్తున్నారో.. ఏమో తెలియదు కానీ.. వ్యాఖ్యల దూకుడు మాత్రం పెరిగిపోయింది.
ఇక, ఈ వరుసలో వైసీపీ కూడా తక్కువేమీ తినడం లేదు. అవకాశం వచ్చిన ప్రతిసారీ.. రెచ్చగొట్టే ధోరణి లోనే నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక, వ్యక్తిగత దూషణలు కూడా ఇటీవల కాలంలో పెరిగిపోయా యి. ఒకరిపై ఒకరు నిందించుకోవడం.. ఒకరిపై ఒకరు పరుష వ్యాఖ్యలు చేసుకోవడం.. పెరిగిపోయింది. నీ అమ్మ మొగుడు
అనే డైలాగుతో.. మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు చాన్నాళ్లు హల్‌చల్ చేశాయి. ఇక, అప్పటి నుంచి టీడీపీలోనూ ఈ ఆరోపణలకు.. వ్యక్తిగత దూషణలకు.. అడ్డుకట్ట పడడం లేదు.
ఈ క్రమంలోనే తాజాగా.. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు.. హద్దులు దాటేశారు. ముఖ్యమంత్రి జగన్‌ను.. ఏకంగా `నా కొ...క
అంటూ.. దూషించడం.. తీవ్ర వివాదానికి దారితీసింది. ‘‘తాను అధికారంలోకి వస్తే పెంచుకొంటూ పోతానని జగన్ ఎన్నికల ముందు చెప్పాడు. పెంచడం అంటే పింఛన్ కాదని ఇలా పన్నులు పెంచడం. పనికిమాలినోళ్లు పాలన చేస్తే ఇలానే ఉంటుంది. నాపై ఎన్ని కేసులు పెట్టుకొంటారో, ఏమి పీక్కుంటారో పీక్కోండి’’ అంటూ శివాలెత్తారు. ‘‘సన్న బియ్యం అంటే తెలియనోడు పౌరసరఫరాల శాఖ మంత్రి. బెట్టింగ్‌రాయుడు ఇరిగేషన్ మంత్రి. మీ జిల్లాకు చెందిన హోం మంత్రిని చూస్తే జాలేస్తోంది. లేని దిశ చట్టంతో ఉరిశిక్ష, జీవిత ఖైదులు వేశామని చెబుతున్నారు. లేని దిశ చట్టం కోసం ఆ నాకొ… రాజమండ్రిలో దిశ స్టేషన్ ప్రారంభించాడు. హోం మంత్రికి సిగ్గు, లజ్జ ఉంటే తక్షణమే రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేశారు.
ఎప్పుడు అవకాశం వస్తే.. అప్పు డు విరుచుకుపడేందుకు రెడీగా ఉన్న వైసీపీకి ఇది అందివచ్చిన అవకాశంగా మారింది. దీంతో అయ్యన్న వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ.. చంద్రబాబు నివాసానికి పోటెత్తడం.. తాజా వివాదానికి దారితీసిం ది. ఇక, ఈ ఘటన తర్వాత అయినా.. టీడీపీలో మార్పు కనిపించకపోవడం గమనార్హం. అటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోసారి రెచ్చిపోయారు. వైసీపీ గూండాలు.. తాలిబాన్లు .. అంటూ.. మరోసారి రెచ్చిపోయారు. ఇక, అమరావతి మహిళలు మరింతగా రెచ్చిపోయారు. ఈ పరిణామాలను గమనిస్తే..ఏపీలో రాజకీయాలు ఎటు పోతున్నాయనే ప్రశ్నలు తెలెత్తు తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. రాష్ట్రం మరో బీహార్ కావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 17, 2021 3:49 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…