Political News

ఆన్ లైన్ టికెట్ల మీద ఏపీ మంత్రి ఇచ్చిన తాజా క్లారిటీ ఇదే

ఏపీలోని సినిమాహాళ్ల టికెట్లను ఆన్ లైన్ లో అమ్మే అంశంపై చోటు చేసుకున్న రగడ తెలిసిందే. ప్రభుత్వమే.. ఆన్ లైన్ టికెట్లను అమ్ముతానని చెప్పటం.. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేయటం.. టికెట్లు అమ్మిన 20 రోజులకు డబ్బులు ఇస్తామని చెప్పటం లాంటి అంశాల్ని పలువురు తప్పు పడుతున్నారు. దీంతో.. ఈ వ్యవహారంపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలపై తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యమైన అంశాల్ని చూస్తే..

  • ఇటీవల తెలుగు చిత్రపరిశ్రమ రంగ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన సందర్భంలో వివిధ అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా సినిమా టికెట్లను ఆన్ లైన్ లో అమ్మే అంశాన్ని పరిశీలించాలని వారు కోరారు. ఈ మేరకు త్వరలోనే ముఖ్యమంత్రి సమక్షంలో సినీ రంగ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.
  • తెలుగు సినీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకొచ్చేలా సీఎం జగన్ అనే చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కొవిడ్ వేళ.. పలు రాయితీలను కూడా ప్రకటించారు. ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రమంతో పన్ను ఎగవేతకు.. బ్లాక్ టికెట్ దందాకు చెక్ పెట్టొచ్చు.
  • అనధికార షోలు.. టికెట్ ధర నియంత్రణ ప్రజలు తక్కువ రేటుకే వినోదం అందుతుంది. రాష్ట్రంలో అన్ని థియేటర్లను అనుసంధానం చేస్తూ ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందించే ఆలోచన ఉంది.
  • ఆన్ లైన్ లో టికెట్లను అమ్మాలన్న ప్రభుత్వ ఆలోచనపై విపక్షంలోని మేధావులుగా భావించే వారు నానా రాద్దాంతం చేస్తున్నారు. ఈ అంశం గడిచిన రెండు దశాబ్దాలుగా నడుస్తోంది. 2002లోనే ఆన్ లైన్ సినిమా టికెట్లపై కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది.
  • 2003లో విజయవాడకు చెందిన విశ్వ మీడియా ఎంటర్ ప్రైజెస్.. 2004లో విశాఖకు చెందిన గెలాక్సీ ఎంటర్ ప్రైజెస్ లు ఆన్ లైన్ టికెట్ల అమ్మకానికి ముందుకు వచ్చాయి. 2006లో అప్పటి ప్రభుత్వం ఆన్ లైన్ టికెట్ల విక్రయంపై గెజిట్ కూడా విడుదల చేసింది. 2009లో గెలాక్సీ ఎంటర్ ప్రైజెస్ కు అనుమతి ఇచ్చినా.. ప్రక్రియ మొదలు కాలేదు.
  • 2017లో తెలుగుదేశం ప్రభుత్వం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని నియమించింది. అదే ఏడాది హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌.. తెలుగు సినీ పరిశ్రమ ఛైర్మన్.. తదితరులతో కమిటీని ఏర్పాటు చేశారు. 2018లో కమిటీ ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకానికి ఆమోదం తెలిపింది.
  • అందరి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం ఆన్ లైన్ లో సినిమా టికెట్ల అమ్మకాల్ని చేపట్టాలని భావిస్తోంది. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

This post was last modified on September 15, 2021 10:18 am

Share
Show comments

Recent Posts

రాహుల్ వ‌ర్సెస్ ఖ‌ర్గే.. కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం!

జాతీయ పురాత‌న పార్టీ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌తంగా భారీ క‌ల‌క‌లం రేగిన‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌రు కీల‌క నాయకుల మ‌ధ్య వివాదాలు తార‌స్థాయికి…

55 seconds ago

ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది

గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…

22 minutes ago

నిత్యమీనన్ ఆ బయోపిక్ ఎందుకు చేయలేదు?

దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…

47 minutes ago

గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్

తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

2 hours ago

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ…

2 hours ago

వ‌ల‌సల‌పై ట్రంప్ నిర్ణ‌యం.. అమెరికాకు చేటేనా?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి మాట‌లు చె ప్పినా.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు…

3 hours ago