Political News

జ‌న స‌మీక‌ర‌ణ‌పై దృష్టి.. బ‌లం చాటాలిగా!

స‌భ‌లు.. స‌మావేశాలు.. ర్యాలీలు.. పాద‌యాత్ర‌.. ఇలా తెలంగాణ‌లో మునుపెన్న‌డూ లేని విధంగా రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. అధికారంలో ఉన్న కేసీఆర్‌ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీల‌ను గెలిపించుకోవ‌డ‌మే వ్యూహంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు సాగుతున్నాయి. అందుకే కేసీఆర్‌ను అన్ని వైపులా నుంచి టార్గెట్ చేసుకుంటూ ఆ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర చేస్తూ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతుండ‌గా.. తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ద‌ళిత‌, గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ దండోరా స‌భ‌ల పేరుతో టీఆర్ఎస్‌పై విరుచుకుప‌డుతున్నారు.

సెప్టెంబ‌ర్ 17న తెలంగాణ‌లో రాజ‌కీయ వేడి మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని అటు నిర్మ‌ల్ భారీ బ‌హిరంగ స‌భ నిర్వహించే దిశ‌గా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. మ‌రోవైపు సీఎం కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గ‌మైన గ‌జ్వేల్‌లో ద‌ళిత‌, గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ దండోరా బ‌హిరంగ స‌భ‌ను విజ‌య‌వంతం చేసేందుకు ఇటు కాంగ్రెస్ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. ఈ రెండు స‌భ‌ల‌తో త‌మ బ‌లాన్ని చాటాల‌నే ఉద్దేశంతో ఉన్న బీజేపీ కాంగ్రెస్‌లు ప్ర‌జ‌ల‌ను ఈ స‌భ‌ల‌కు తీసుకొచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. భారీ జ‌న స‌మీక‌ర‌ణ చేయాల‌ని నిర్ణ‌యించాయి.

గ‌తేడాది బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్ ఎంపికైన త‌ర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ దూకుడు పెరిగింది. దుబ్బాక ఉప ఎన్నిక‌లో గెల‌వ‌డంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ గొప్ప‌గా పుంజుకుంది. ఇదే హ‌వాను కొన‌సాగించి రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను మార్పులు తేవ‌డ‌మే ల‌క్ష్యంగా సంజ‌య్ పాద‌యాత్ర కొన‌సాగిస్తున్నారు. ఆయ‌న పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌నే ద‌క్కుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదే ఊపులో తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని అధికారికంగా నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వాన్ని ఎప్ప‌టి నుంచో డిమాండ్ చేస్తున్న బీజేపీ ఈ సారి సెప్టెంబ‌ర్ 17న భారీ స‌భ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఈ స‌భ‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజ‌రు కానున్నారు. దీంతో భారీ సంఖ్య‌లో జ‌నాన్ని పోగేసి త‌మ బ‌లాన్ని కేసీఆర్‌కు చూపించాల‌నే ల‌క్ష్యంతో రాష్ట్ర బీజేపీ నాయ‌కులు ఉన్నారు. ఆ మేర‌కు బండి సంజ‌య్ నేతృత్వంలో ఆ పార్టీ రాష్ట్ర ప‌దాధికారుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నిర్మ‌ల్‌లో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌కు భారీ సంఖ్య‌లో జ‌నాన్ని స‌మీక‌రించాల‌ని నిర్ణయించారు.

మ‌రోవైపు టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌ర్వాత జోరు పెంచిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ బ‌లోపేతం దిశ‌గా గ‌ట్టిగానే కృషి చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. పార్టీలోని కొంత‌మంది సీనియ‌ర్లు ఆయ‌న వ్య‌వ‌హార‌శైలిపై అసంతృప్తితో ఉన్న‌ప్ప‌టికీ పార్టీ అధిష్ఠానం అండ‌తో రేవంత్ దూసుకెళ్తున్నారు. సీఎం కేసీఆర్‌కు ప్ర‌తి విష‌యంలోనూ స‌వాలుగా మారారు. ఇప్పుడ‌దే ఊపులో కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గమైన గ‌జ్వేల్‌లోనే స‌భ విజ‌య‌వంతంగా నిర్వ‌హించి త‌న స‌త్తా చాటాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. కేసీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఈ స‌భ విజ‌య‌వంత‌మైతే అది రేవంత్‌కు ఎంత‌గానో క‌లిసొస్తుంద‌న‌డంలో సందేహం లేదు. అందుకే ఇంద్ర‌వెల్లి, రావిర్యాల స‌భ‌ల‌కు మించి గ‌జ్వేల్ స‌భ‌కు జ‌న స‌మీక‌ర‌ణ చేప‌ట్టాల‌ని టీపీసీసీ నిర్ణ‌యించింది. ద‌ళితులు, గిరిజ‌నుల‌కు ఇచ్చిన హామీల అమ‌లులో వైఫ‌ల్యంపై గ‌జ్వేల్ స‌భ‌లో సీఎం కేసీఆర్‌పై ఛార్జిషీట్ విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ స‌భ‌కు రాహుల్ గాంధీని ర‌ప్పించేందుకు రేవంత్ ప్రయ‌త్నాలు చేశారు కానీ అవి స‌ఫ‌లం కాలేన‌ట్లు తెలుస్తోంది.

This post was last modified on September 12, 2021 3:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

6 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

6 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

7 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

9 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

9 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

10 hours ago