Illustrative picture of coronavirus vaccine under trail
కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గుతోంది, మళ్ళీ మళ్ళీ పెరుగుతోంది. ఈ దశలో కరోనా వైరస్ బారి నుండి మనల్ని మనం కాపాడుకోవటానికి రెండు డోసుల కోవిడ్ టీకాలు వేసుకోవటం ఒకటే మార్గమని శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. రెండు టీకాలు తీసుకున్నవారు కూడా హమ్మయ్య మనకేం ప్రమాదం లేదని ప్రశాంతంగా ఉన్నారు. అయితే తాజాగా వెల్లడైన అధ్యయనం ప్రకారం రెండు డోసులు తీసుకున్నంత మాత్రాన వైరస్ నుండి రక్షణ వచ్చినట్లు కాదట.
అమెరికా డాక్టర్ చిలిమూరి శ్రీధర్ అధ్యయనం ప్రకారం రెండు డోసుల రక్షణ కేవలం 6 మాసాలు మాత్రమే ఉంటుందని తేలింది. రెండు టీకాలు వేసుకున్న 6 మాసాల వరకు మాత్రమే యాంటీబాడీలు రక్షిస్తాయి అని తేలిందట. తర్వాత కంపల్సరీగా మూడో డోసు కూడా వేసుకుంటేనే మరింత రక్షణగా ఉంటుందని అర్ధమవుతోంది. మరి మూడో డోసుతో సరిపోతుందా లేకపోతే కొంతకాలం తర్వాత నాలుగో డోసు కూడా అవసరమని అంటారేమో తెలీదు. సాధారణ వ్యక్తులు మూడో డోసు తీసుకున్న 6-8 నెలల మధ్య మూడో డోసు తీసుకోవాల్సిందే అని డాక్టర్ చెప్పారు.
అలాగే రోగనిరోధక శక్తి ఉన్న మామూలు మనుషులు రెండో డోసు తీసుకున్న నాలుగు వారాలకే మూడో డోసు వేసుకోవాల్సిందే అని శ్రీధర్ చెప్పటం కాస్త ఆందోళనకరమే. ప్రస్తుత కాలంలో జీవన విధానం ప్రకారం చూస్తే చాలామందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతోందని అందరికీ తెలిసిందే. 2024 నాటికి కాని కరోనా వైరస్ ప్రభావం తగ్గదని తేలిందట. అప్పటికి కూడా పూర్తిగా మాయమైపోతుందని చెప్పటంలేదు. ప్రభావం తగ్గుతుందని మాత్రమే చెబుతున్నారంటే అప్పటికి కూడా కరోనా వైరస్ ఏదోరూపంలో ఉంటుందని స్పష్టమవుతోంది.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, ముసలివాళ్ళకు కచ్చితంగా మూడో డోసు ఇస్తేనే పరిస్ధితులు అదుపులో ఉంటాయని శ్రీధర్ చెప్పారు. టీకాలు తీసుకోని 18 ఏళ్ళలోపు వారికి కరోనా వైరస్ సోకే ప్రమాధం ఎక్కువగా ఉందట. టీకాలు తీసుకోని 20-30 ఏళ్ళ మధ్య యువకులకు అమెరికాలో కరోనా వైరస్ ఎక్కువగా సోకిన విషయాన్ని డాక్టర్ గుర్తుచేశారు. మాస్కులు ధరించటం, భౌతికదూరాన్ని పాటించటం, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు కూర్చోవటమే కరోనా వైరస్ కట్టడికి మంచి మార్గాలుగా డాక్టర్ చెప్పారు.
బయటపడుతున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్లు కొన్నిదేశాల్లో టీకాల ప్రభావాన్ని కూడా తట్టుకుని విజృంభిస్తున్న విషయాన్ని డాక్టర్ తెలిపారు. అందుకనే మూడో డోసుకూడా వేసుకోవాల్సిందే అని గట్టిగా చెబుతున్నారు. అమెరికా లాంటి కొన్ని దేశాల్లో టీకాల ప్రభావం కన్నా వైరస్ ప్రభావమే ఎక్కువగా కనిపించిందని చెప్పారు. రెండు డోసుల టీకాలు తీసుకున్న వారికి కూడా కరోనా వైరస్ సోకుతున్నపుడు ఇక టీకాలు తీసుకోనివారి పరిస్ధితి ఏమిటనే విషయంలో డాక్టర్ ఆందోళన వ్యక్తంచేయటం గమనార్హం. అంటే డాక్టర్ చెప్పింది చూస్తుంటే ఎన్ని డోసులు తీసుకున్నా ఉపయోగం ఉండేట్లులేదు.
This post was last modified on September 12, 2021 1:37 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…