కేసీఆర్ సర్కార్ ని ఇరకాటంలో పెట్టేందుకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే.. కేసీఆర్ సర్కార్ పై సీబీఐ కి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కోకాపేట భూముల విక్రయం లో రూ. 1500 కోట్ల కుంభకోణం జరిగిందని…ఈ కుంభకోణం పై విచారణ జరగాల్సిన అవసరం ఉందని తన ఫిర్యాదు లో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కుంభకోణా ల్లో అనేక మంది ఐఏఎస్ అధికారుల పాత్ర ఉందని ఫిర్యాదు పేర్కొన్న రేవంత్ రెడ్డి. కెసిఆర్ సన్నిహితులు ఉన్నతాధికారులు భూములు దక్కించుకున్నారని ఆరోపణలు చేశారు. అధికార బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కెసిఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు
ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి అప్పాయింట్మెంట్స్ కోరానని రేవంత్ రెడ్డి తెలిపిారు. సీఎం కేసిఆర్ అవినీతి పై చర్యలు తీసుకోవడం లో అధికార బిజెపి పార్టీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించాలని ఆయన సవాల్ విసిరారు. కాగా… ఇటీవలే… ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు… కోకాపేట భూములను తెలంగాణ సర్కార్ అమ్మిన సంగతి తెలిసిందే.
This post was last modified on September 9, 2021 2:28 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…