రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 72 నియోజకవర్గాల్లో గెలుస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. తాను చెప్పినన్ని సీట్లు వస్తాయో రావో ఇప్పుడే చెప్పలేం కానీ రేవంత్ అయితే పార్టీకి మునుపటి జోష్ తేవడానికి చాలా కష్టపడుతున్నారు. పార్టీ నేతల్లో ముఖ్యంగా యువతలో ఉత్సాహం నింపడానికి రేవంత్ చాలా గట్టిగానే ట్రై చేస్తున్నారు. పార్టీలో గతంలో ఎప్పుడు లేనంతగా ఇపుడు యువనేతలనే రేవంత్ బాగా ప్రోత్సహిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
దాదాపు ఏడేళ్ళుగా పార్టీ నేతలు, క్యాడర్లో కనబడని జోష్ రేవంత్ చేతికి పార్టీ పగ్గాలు వచ్చిన తర్వాతే కనబడుతోందన్నది వాస్తవం. అందుకనే పార్టీ వైపు ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఆకర్షించేందుకు రేవంత్ తన వంతుగా బాగా కష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన దండోరా పేరుతో సభ నిర్వహించారు. తర్వాత మూడు చింతల లో వరుసగా రెండు రాత్రుళ్ళు బస చేశారు. అంటే రేవంత్ చేపడుతున్న కార్యక్రమాలన్నీ పార్టీకి దూరమైన వర్గాలను మళ్ళీ చేరువచేయటమని అర్ధమవుతోంది.
సరే ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేస్తే రాబోయే ఎన్నికల్లో పార్టీకి 72 సీట్లు వస్తాయని రేవంత్ వేసిన అంచనాకు ఓ లెక్కుందట. అదేమిటంటే ఉమ్మడి జిల్లాలు ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిపైనే రేవంత్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. పై జిల్లాల్లోని అసెంబ్లీ సీట్లలో అత్యధికం కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని రేవంత్ అంచనా వేసుకున్నారట. పై జిల్లాల్లోనే పార్టీకి కనీసం 55 సీట్ల వరకు వస్తాయని రేవంత్ గట్టిగా నమ్ముతున్నారట.
పై జిల్లాలు కాకుండా గ్రేటర్ పరిధిలో కొన్ని సీట్లు వస్తాయని అంచనాలో ఉన్నారట. ఇక ఈ జిల్లాలు కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ లాంటి జిల్లాల్లో కూడా కొన్ని సీట్లలో గెలిచినా పార్టీ కచ్చితంగా అధికారంలోకి వచ్చేస్తుందన్నది రేవంత్ అంచనాగా తెలుస్తోంది. మరి రేవంత్ అంచనా ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సిందే. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పదే పదే చెబుతున్నారు. ఇదే సమయంలో మరో 20 ఏళ్ళు తమదే అధికారమని టీఆర్ఎస్ మంత్రులు గట్టిగా చెబుతున్నారు. మరి ఎవరి అంచనాలు ఫలిస్తాయో చూడాల్సిందే.
This post was last modified on September 7, 2021 3:38 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…