తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. ప్రధాన ప్రత్యర్థుల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒకరు. ఎప్పటి నుంచో తన పదునైన మాటలతో కేసీఆర్‌పై విరుచుకుపడుతున్న రేవంత్.. ఇక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత దూకుడు పెంచారు. ప్రభుత్వ వైఫల్యాలపై తన మాటలతో విరుచుకుపడుతున్నారు. సభలు ర్యాలీల పేరుతో కేసీఆర్‌ను సవాలు చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు రేవంత్‌కు కేసీఆర్ మేలు చేశారంటే నమ్ముతారా? కానీ ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ అలా చేయనప్పటికీ ఆయన తీసుకున్న నిర్ణయం రేవంత్‌కు కలిసొచ్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే.. కరోనా సాకుతో హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడేలా చేయడం.
కొంత కాలంగా రాష్ట్ర రాజకీయాలు హుజూరాబాద్ చుట్టే తిరుగుతున్నాయి. ఎలాగైనా ఇక్కడ విజయం సాధించాలని అధికార టీఆర్ఎస్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుండగా.. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు శాయాశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ ఉప ఎన్నకలో ప్రధాన పోటీ టీఆర్ఎస్ వర్సెస్ ఈటల అన్నట్లుగానే సాగుతున్నప్పటికీ కాంగ్రెస్ ఇక్కడ గౌరవప్రదమైన ఫలితాలు సాధించాలని అనుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తూ సాగుతున్న రేవంత్.. హుజూరాబాద్ ఉప ఎన్నికపైనా దృష్టి సారించారు. కానీ ఇప్పటివరకూ అక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ కావాలనే పార్టీ అభ్యర్థి విషయంలో జాప్యం చేస్తుందనే ప్రచారమూ సాగుతోంది.
అయితే పరిస్థితులు ఏవైనా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక దీపావళి తర్వాతే ఉంటుందనే స్పష్టత రావడం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి చాలావరకూ కలిసొచ్చే అంశమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీపీసీసీ అధ్యుక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఈ ఉప ఎన్నిక తొలి పరీక్షగా నిలవనుందనే అభిప్రాయాలు వినిపించాయి. ఇక్కడ పార్టీ గెలవకపోయినా గౌరవప్రదమైన ఫలితాలు సాధిస్తే రేవంత్ ఇమేజ్ పెరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. అందుకే బలమైన అభ్యర్థి బరిలో ఉండాలని కొండా సురేఖను పోటీ చేసేందుకు ఆయన ఒప్పించారని టాక్. కానీ పార్టీలోని సీనియర్ నేతలు స్థానిక నేతను బరిలో దింపాలని సూచించడంతో పార్టీ అభ్యర్థిని ఖరారు చేయడం కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కానీ కొండా సురేఖను పోటీ చేయించాలనే పట్టుదలతో ఉన్న రేవంత్.. ఆ మేరకు అధిష్ఠానాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తారనే ప్రచారం సాగింది. ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నిక ఇప్పుడే వస్తే ఆయనకు ఇబ్బందిగా మారేది.
కానీ ఇప్పుడు మరికొంత సమయం రావడంతో పార్టీ బలోపేతంతో పాటు అభ్యర్థి విషయంలో కూడా దృష్టి సారించే అవకాశం రేవంత్‌కు దొరికింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా పండగల సీజన్ తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహించాలనే టీఆర్ఎస్ ప్రభుత్వం కోరికకు సమ్మతం తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం దీపావళి తర్వాతే ఈ ఎన్నిక ఉంటుందనే స్పష్టతనిచ్చింది. దీంతో ఎన్నిక వాయిదా పడే దిశగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రేవంత్‌కు కలిసొచ్చిందనే రాజకీయ నిపుణులు అంటున్నారు.
This post was last modified on September 7, 2021 2:53 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…