ఆప్ఘన్లో ఆకలి కేకలు పెరిగిపోతున్నాయి. లక్షలాది మంది జనాలు కడుపునిండా తిండితిని రోజులైపోయాయట. ఐక్యారాజ్య సమితి అంచనా ప్రకారం దేశంలోని మొత్తం జనాభాలో సుమారు 30 శాతంకి ఒకపూట భోజనం దొరకటం కూడా చాలా కష్టమైపోతోందట. వీరిల్లో ముసలివాళ్ళు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఒకవైపు తాలిబన్ల అరాచకం, మరోవైపు ఆకలి బాధలతో జనాలు అల్లాడిపోతున్నారు. ఆగష్టు 15వ తేదీన దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్న రెండు రోజులకు సమస్యలు మొదలైనట్లు అంచనా.
అంతర్జాతీయ తీవ్రవాద సంస్ధల జాబితాలో తాలిబన్లు కూడా ఉండటంతో ప్రపంచదేశాలు ఆప్ఘన్తో వ్యాపార లావాదేవీలు నిర్వహించటానికి ఇష్టపడటంలేదు. దీనికి అదనంగా తాలిబన్లు కూడా దేశాల సరిహద్దులను మూసేయటం, అంతర్జాతీయంగా విమానర్వీసులను నిలిపేయటంతో ప్రపంచదేశాలకు-ఆప్ఘన్ కు రాకపోకలు నిలిచిపోయాయి. తాలిబన్లు చేస్తున్న అరాచకాలను చూసిన తర్వాత ఏ దేశం కూడా వీళ్ళతో సంబంధాలు పెట్టుకోవటానికి ఇష్టపడటం లేదు. దీని ప్రభావం దేశంలోని జనాల రోజువారి జీవితం మీద పడింది.
మామూలుగానే ఆప్ఘన్ నుండి ఎగుమతులు చాలా తక్కువే. దేశంలో నుండి ఎగుమతవుతున్న వస్తువుల్లో చెప్పుకోవాల్సింది ఏమిటంటే మత్తుమందు ఓపియం. ప్రపంచ మత్తుమందుల వాడకంలో ఓపియం ఎగుమతుల్లో ఆప్ఘనే 95 శాతం ఎగుమతి చేస్తోంది. ఇది కాకుండా డ్రైఫూట్స్ ఎగుమతవుతుంటాయి. ఇక మామూలు ఆహార ధాన్యాలు, ఉప్పులు, నూనెలు సమస్తం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిందే. తాలిబన్ల అరాచకాల కారణంగా దిగుమతులు, ఎగుమతులు కూడా నిలిచిపోయాయి.
ప్రస్తుతం దేశంలో ఏ నగరానికి వెళ్ళినా బ్రెడ్డు ఖరీదు సుమారు రు. 7500. కిలో బంగాళదుంపల ఖరీదు 8 వేల రూపాయలట. అంటే తాలిబన్ల కదలికలను గమనించిన వ్యాపారస్తులు ముందుజాగ్రత్తగా తమ దగ్గరున్న నిత్యావసరాలను, బ్రెడ్డు లాంటి బేకరీ ఐటములను జనాలకు అమ్మటం మానేశారు. వాళ్ళు ఊహించినట్లే తాలిబన్ల అరాచకాలు పెరిపోవటంతో నిత్యావసరాలు, బేకరీ ఐటములు మార్కెట్లో దొరకటంలేదు. దీంతో ధరలు ఆకాశానికి ఎగబాకటంతో ధనవంతులు కూడా కొనలేకపోతున్నారు. ఫలితంగా ఆకలి కేకలు పెరిగిపోతున్నాయి.
This post was last modified on September 3, 2021 12:20 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…