టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేయబోతున్నారంటూ కొద్దిరోజుల క్రితం ప్రచారం సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ లోకేష్ లు తన ఫోన్ లు కూడా లిఫ్ట్ చేయడం లేదని బుచ్చయ్య చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. అయితే, గోరంట్లతో టీడీపీ ముఖ్యనేతలు సంప్రదింపులు జరపడంతో బుచ్చయ్య చౌదరి తన రాజీనామా గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబుతో గోరంట్ల భేటీ అయ్యారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబుతో భేటీ కావాలంటూ బుచ్చయ్య చౌదరికి పిలుపు వచ్చింది. ఈ క్రమంలోనే పార్టీ అదినేతతో సమావేశమైన బుచ్చయ్య చౌదరి…పలు విషయాలపై చర్చించారని తెలుస్తోంది. తన అసంతృప్తికి గల కారణాలను చంద్రబాబుకు గోరంట్ల వివరించారు. ఈ భేటీలో గోరంట్లతోపాటు పార్టీ సీనియర్ నేతలు చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గద్దె రామ్మోహన్ కూడా వచ్చారు.
పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు తనను కలిచివేశాయని, తన మాటకు విలువ ఇవ్వకుండా అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు, వాటి పర్యవసానాలపై చంద్రబాబుతో గోరంట్ల చర్చించినట్లు తెలుస్తోంది. తనకు ఇష్టం లేకపోయినా…పార్టీ నిర్ణయం ప్రకారం రాజమండ్రి రూరల్ కు వెళ్లానని గోరంట్ల చెప్పిన విషయాలని చంద్రబాబు సావధానంగా విన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత రాజీనామాపై గోరంట్ల వెనక్కు తగ్గారని ప్రచారం జరుగుతోంది.
అయితే, గోరంట్ల అలక మాన్పించేందుకు చంద్రబాబు ఏం హామీలు ఇవ్వబోతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో ఆ పదవిపై గోరంట్ల ఆశపడుతున్నారని, అధినేత దృష్టికి ఈ విషయాన్ని తెచ్చారని తెలుస్తోంది. త్వరలో జరగబోయే రాజమండ్రి కార్పోరేషన్ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక, కొన్ని పదవులు, ఇతర వ్యవహారాల్లో తన మాట చెల్లేలా చూడాలని కూడా గోరంట్ల కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ అంశాలపై చంద్రబాబు ఆయనకు హామీ ఇస్తారా లేదా అన్నది త్వరలో తేలిపోనుంది.
This post was last modified on September 3, 2021 11:02 am
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…