కృష్ణా జలాల వినియోగంపై ఇంతకాలం తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న వాదనల్లోని పసలేదని బయటపడింది. తన వాదనలో లాజిక్ లేదని తేలిపోయాక, అడ్డుగోలు వాదన సాధ్యం కాదని అర్ధమైపోయాక సింపుల్ గా సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ చేసేసింది. రెండు రాష్ట్రాల మధ్య మొదలైన జలవివాదాలపై చర్చించేందుకు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబి) సమావేశం జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల్లోని జలవనరుల శాఖల్లోని ఉన్నతాధికారులు హాజరయ్యారు.
కృష్ణా జలాల వినియోగం ఎప్పటినుండో అమల్లో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కాదని తెలంగాణా ప్రభుత్వం వితండ వాదన మొదలు పెట్టింది. ట్రైబ్యునల్ ప్రకారం ఏపికి 66 శాతం, తెలంగాణాకు 34 శాతం నీటి వినియోగంలో హక్కుంది. అయితే ట్రైబ్యునల్ తీర్పును కాదని చెరిసగం వాడుకోవాల్సిందే అనే వితండ వాదన తెలంగాణ మొదలుపెట్టింది.
ఒకవైపు నీటి నిల్వ సామర్ధ్యంతో సబంధం లేకుండానే శ్రీశైలం డ్యాం నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తూనే మరోవైపు నీటి వాటాను చెరిసగం కావాల్సిందే అంటు కావాలనే వాదన పెట్టుకుంది. ఎందుకంటే జల విద్యుత్ ఉత్పత్తి విషయంలో తన నిర్ణయాన్ని సమర్దించుకునే అవకాశం లేదని తెలిసిన తర్వాత జలవివాదాలకు కావాలనే ఆజ్యంపోసింది. తెలంగాణా ఉద్దేశ్యం ఏమిటో అర్ధమైపోయిన తర్వాత ఇక లాభం లేదని ఏపి… ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, భద్రతపై కేంద్రం జోక్యం కావాలంటు లేఖ రాసింది.
ఎప్పుడైతే కృష్ణా, గోదావరి రివర్ యాజమాన్య బోర్డులను కేంద్రం తన చేతిలోకి తీసేసుకుందో వెంటనే తెలంగాణాకు ఏమిచేయాలో అర్ధంకాలేదు. ఒకసారి రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తే తన బండారం బయటపడిపోతుంది. అందుకనే పదే పదే సమావేశాలు గైర్హాజరవుతోంది. అయితే బుధవారం జరిగిన సమావేశానికి హాజరు కాక తప్పలేదు. దాంతో ఇష్టం లేకుండానే తెలంగాణా జలవనరుల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అందరూ అనుకున్నట్లే ఐదు గంటలపాటు జరిగిన సమావేశం, వాదనల్లో తెలంగాణ ప్రభుత్వం వాదన తేలిపోయింది. నీటి వాటాలో మార్పుండదని కేంద్రం స్పష్టంగా తేల్చిచెప్పింది. పైగా జలవిద్యుత్ ను వెంటనే ఆపాలని కూడా గట్టిగా హెచ్చరించింది. శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు అని తెలంగాణా వాదించింది. కాదని ఏపీ వాదించింది. తెలంగాణా వాదన ఏ విధంగా తప్పోకూడా నిరూపించింది. దాంతో తన వాదనను సమర్ధించుకునే అవకాశం తెలంగాణాకు లేకుండాపోయింది. దాంతో ఏపి తాగు, సాగునీటి అవసరాలు తీరిన తర్వాతే శ్రీశైలంలో ప్రాజెక్టులో జలవిద్యుత్ చేయాలంటు చెప్పింది. దాంతో తెలంగాణా ప్రభుత్వం సమావేశం నుండి వాకౌట్ చేసి వళ్ళిపోయింది.
This post was last modified on September 2, 2021 3:49 pm
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ…
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…