ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు ఆగస్టు 31లోగా తప్పుకోవాలంటూ తాలిబన్లు విధించిన డెడ్ లైన్ ను అమెరికా సేనలు తు.చ తప్పకుండా పాటించాయి. గడువు ముగియక ముందే కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా తన చివరి సైనికుడితో సహా అందరినీ వెనక్కి తీసుకెళ్లింది. అమెరికా సేనలున్నపుడే నరమేధానికి పాల్పడిన తాలిబన్లు…తమ గడ్డ మీద నుంచి అమెరికా సేనలు పూర్తిగా వైదొలగడంతో మరోసారి ఉన్మాద పాలనకు శ్రీకారం చుట్టాయి. ఈ క్రమంలోనే రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘాన్ లో తాలిబన్లపై పోరు కోసం అమెరికా ఎంత ఖర్చు పెట్టింది? 20 ఏళ్ల పాటు ఆఫ్ఘాన్ లో పాగా వేసిన అమెరికా ఏం సాధించింది? అన్న చర్చ మొదలైంది.
20 ఏళ్ల క్రితం అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ టవర్స్‌పై ఉగ్రవాదుల దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అగ్రరాజ్యం అమెరికాపై ఉగ్రదాడి ఘటనతో ప్రపంచదేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. దీంతో, ఆఫ్ఘనిస్తాన్‌పై అమెరికా వార్ డిక్లేర్ చేసింది. అమెరికా సేనలు ఆఫ్ఘనిస్తాన్‌ను జల్లెడపట్టి తాలిబన్ల సహా పలు ఉగ్రమూకలను తరిమికొట్టి 2001లో ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించాయి. 20 ఏళ్లపాటు ఆమెరికా రక్షణలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజాస్వామ్య ప్రభుత్వం కొనసాగింది. తాజాగా అమెరికా సేనలు ఆఫ్ఘాన్ నుంచి వెనుదిరగడంతో 2001 ముందు నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి.
అయితే, ఆఫ్ఘాన్ లో ఉగ్రపోరుకు ఈ 20 ఏళ్ల కాలంలో అమెరికా దాదాపు రూ.146 లక్షల కోట్లు ఖర్చు చేసింది. వివిధ రూపాల్లో అప్పుగా ఈ మొత్తాన్ని అమెరికా తెచ్చింది. 2050 నాటికి వడ్డీతో సహా ఈ అప్పులు రూ.474.30 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అయితే, ఇంత ఖర్చుపెట్టినా….ఈ 20 ఏళ్లలో అమెరికా ఉగ్రవాదంపై పోరులో ఏం సాధించింది అని వెనక్కు తిరిగి చూసుకుంటే…ఏమీ లేదనే సమాధాం వస్తుంది.
ఈ 20 ఏళ్లలో అమెరికా సేనల వల్ల ఆఫ్ఘాన్ లో విద్యుద్ సదుపాయం మెరుగుపడింది. 2001 నాటికి 22 శాతం మందికి మాత్రమే విద్యుత్ సదుపాయం ఉండగా….అది 2019 నాటికి 98 శాతానికి చేరింది. శిశు మరణాల రేటు 50 శాతానికి పైగా తగ్గగా, అక్షరాస్యతా శాతం 37 శాతం పెరిగింది. అయితే, ఇంత ఖర్చు పెట్టినా అమెరికన్లకు ఒరిగిందేమీ లేదనే చెప్పాలి. ఆఫ్ఘన్ రక్షణ కోసం అమెరికా లక్షల కోట్ల రూపాయలను ఖర్చుచేసి అధునాతన ఆయుధాలు సమకూర్చింది.
వెళ్లేటప్పుడు వీలైనన్ని ఆయుధాలను వెనక్కి తీసుకెళ్లిన అమెరికా, చాలా ఆయుధాలను ఆఫ్ఘన్‌లోనే వదిలేసింది. అయితే, అమెరికా టెక్నీషియన్లు తప్ప మరెవరు వాటిని రిపేర్ చేయడానికి వీలు లేకుండా చాలా వరకు నిర్వీర్యం చేసింది. ఈ 20 ఏళ్ల కాలంలో వేలాది మంది అమెరికా సైనికులు, పౌరులు ఆఫ్ఘాన్ యుద్ధంలో మరణించారు. ఉగ్రవాదంపై పోరు అంతులేని కథలా అలాగే మిగిలింది. 20 ఏళ్లు పోరాడి…లక్షల కోట్ల అప్పును అమెరికా పౌరుల నెత్తి మీద పెట్టి…ఆ దేశాన్ని తాలిబన్ల చేతిలో అమెరికా అధ్యక్షఉడు బైడెన్ పెట్టారని విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on September 1, 2021 7:27 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…