తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చిత్రమైన పరిస్థితి నెలకొందని చెప్పాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా దక్కిన గుర్తింపును ఉపయోగించుకోవడంలో విఫలమైన ఆ పార్టీ రాష్ట్రంలో వరుసగా రెండు ఎన్నికల్లోనూ దారుణంగా దెబ్బతిన్నది. కాంగ్రెస్ వల్లే తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైందనే విషయాన్ని బలంగా తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు విఫలమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. పార్టీలో పదవులు కావాలి కానీ పార్టీ బలోపేతానికి కృషి చేయం అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నించం అనేలా సీనియర్ల తీరు ఉందని ఇప్పటికీ టాక్ ఉంది. టీపీసీసీలో కీలకమైన పదవుల్లో ఉన్ సమయంలో కాంగ్రెస్‌ను పటిష్ఠం చేయడం సంగతి పక్కనపెట్టిన ఆ సీనియర్ నేతలు.. ఇప్పుడు దూకుడు మీదున్న రేవంత్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నరని టాక్.
పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు వ్యతిరేకించినప్పటికీ టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని అధిష్ఠానం నియమించింది. ఆ పదవి దక్కిన తర్వాత రేవంత్ దూకుడు మరోస్థాయికి చేరింది. ర్యాలీలు సభలు ధర్నాలు అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కానీ ఇప్పడాయన వైఖరి పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలకు నచ్చడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడయ్యాక కొంతమంది సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కితే మరికొంత మంది మాత్రం బయటపడలేదు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటివరకూ రేవంత్‌పై తన ఉద్దేశాన్ని బయట పెట్టలేదు. అయితే తాజాగా రేవంత్ వ్యవహారశైలిపై ఉత్తమ్ పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణక్యం ఠాగూర్ ముందు ఉత్తమ్ తన మనసులో మాటను బయటపెట్టినట్లు తెలుస్తోంది.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకం తర్వాత ఇప్పుడే తొలిసారి గాంధీభవన్‌కు వచ్చిన ఉత్తమ్.. మాణిక్యం ముందు రేవంత్‌పై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీని పార్టీలాగా నడిపించాలని ఒక్కరికే గుర్తింపు రావడం కోసం కాకుండా పార్టీని బలోపేతం చేయడం కోసం పనిచేయాలని ఉత్తమ్ సూచించారు. పార్టీలోని సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడంలో కొత్త కార్యవర్గం విఫలమైందని ఆయన అన్నారు. రేవంత్ వైఖరిని ఉద్దేశించే పరోక్షంగా ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తమ మాటలు విన్న తర్వాత మాణిక్యం.. సమిష్టిగా పనిచేయాలని సీనియర్ల అనుభవాలను పార్టీ బలోపేతం కోసం వినియోగించుకోవాలని రేవంత్‌కు సూచించారని సమాచారం.
అయితే రేవంత్‌పై ఉత్తమ్ అసంతృప్తి వెనక చాలా కారణాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొందరు నేతలపై టీపీసీసీ బహిష్కరణ వేటు వేసింది. అయితే వేటు పడ్డ వాళ్లు ఉత్తమ్‌కు కావాల్సిన వాళ్లని సమాచారం. వారిపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఉత్తమ్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ దూకుడుగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి సారథ్యంలోని కొత్త కార్యవర్గం వాళ్లపై వేటు వేసిందని చెప్పుకుంటున్నారు. మరోవైపు కొన్ని సభలు, సమావేశాల విషయంలోనూ పార్టీ సీనియర్లతో చర్చించకుండానే రేవంత్ నిర్ణయం తీసుకుంటున్నారని తమకు కనీసం సమాచారం ఇవ్వడం లేదని కొంతమంది సీనియర్ నేతలు ఉత్తమ్ దృష్టికి తీసుకొచ్చారని తెలిసింది. దీంతో రేవంత్‌పై ఉన్న అసంతృప్తిని మాణ్యకం ముందు ఉత్తమ్ వెళ్లగక్కారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
This post was last modified on August 31, 2021 9:41 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…