అప్పుల తిప్పలు ఏపీ ప్రభుత్వాన్ని వెంటాడుతూ వేధిస్తున్నాయి. తలకు మించిన సంక్షేమ పథకాల అమలుతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. అప్పుల మీద అప్పులు తీసుకొస్తూ బండి నడిపే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా రూ.7వేల కోట్ల అప్పు కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. అయితే.. ప్రభుత్వం ఇచ్చే కొత్త గ్యారెంటీకి అవకాశం లేకున్నా.. ఫైలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా గత ఆర్థిక సంవత్సరంలోని ఆదాయంలో 90 శాతాన్ని గ్యారెంటీ పరిమితిగా ఇచ్చే వీలుంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయం రూ.1.20 లక్షల కోట్లు. అంటే అందులో 90 శాతం అంటే రూ.1.06 లక్షల కోట్లన్న మాట. మార్చి 31 నాటికే ప్రభుత్వం రూ.1.19లక్షల కోట్ల రుణాన్ని గ్యారెంటీగా తీసుకొచ్చింది. ఇందులో రూ.1.13 లక్షల కోట్లను వాడేసింది. అంటే.. గ్యారెంటీల పరిమితిని దాటి అదనంగా రూ.7వేల కోట్లను అధికంగా వాడేశారు.
తాజాగా మరో రూ.7వేల కోట్లు అప్పుగా తేవాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వాలు చేసే అప్పులకు సహకారం అందించకూడదనంటూ ఇటీవల జరిగిన సమావేశంలో కేంద్రం నిర్ణయించింది. అంతేకాదు.. ఆర్ బీఐ ఇచ్చిన ఆదేశాల్ని బ్యాంకులు ఏ మాత్రం సీరియస్ గా తీసుకోకపోవటం కూడా ఇప్పుడు చర్చగా మారింది.
ఇంత జరుగుతున్నా.. తాజాగా మరో రూ.7వేల కోట్ల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేయటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఏపీలో ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కేంద్రం కన్ను వేసిన వేళ.. తాజా రూ.7వేల కోట్లు తీసుకురావటం సాధ్యమవుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
This post was last modified on August 31, 2021 10:13 am
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…