మామూలుగా పార్టీ, ప్రభుత్వ అధినేతలను నోటికొచ్చినట్లు మాట్లాడిన వాళ్ళపై చర్యలుంటాయని అందరికీ తెలుసు. కానీ పొగిడితే కూడా తీవ్ర చర్యలు తప్పవని తాజాగా ఓ ముఖ్యమంత్రి గట్టిగా చెప్పటమే విచిత్రంగా ఉంది. ఈ ఘటన తమిళనాడు అసెంబ్లీలో చోటు చేసుకున్నది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డీఎంకే ఎంఎల్ఏ ఒకరు మాట్లాడుతు సీఎం స్టాలిన్ను ఆకాశమే హద్దుగా పొగుడుతూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కొద్దిసేపు ఎంఎల్ఏ స్పీచ్ ను చూసిన సీఎంకు బాగా చిర్రెత్తినట్లుంది. వెంటనే జోక్యం చేసుకున్నారు.
ఎంఎల్ఏ ప్రసంగిస్తుండగానే స్టాలిన్ జోక్యం చేసుకుని తనను పొగడద్దని గట్టిగా చెప్పారు. అయినా సదరు ఎంఎల్ఏ వినకపోవటంతో స్టాలిన్ రెండోసారి జోక్యం చేసుకుని తీవ్రంగా హెచ్చరించారు. మంత్రులైనా, ఎంఎల్ఏలు అయినా సభలో మాట్లాడేటపుడు సమస్యలు, నియోజకవర్గాల సమస్యలు+పరిష్కారాలతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మాత్రమే వివరించాలని గట్టిగా చెప్పారు. సభలో సమావేశాలు అర్ధవంతంగా ఉండాలని, విలువైన సమయాన్ని వృధా చేయద్దని చెప్పారు.
ఇకనుండి ఎవరైనా తనను పొగిడితే అలాంటి వాళ్ళపై కఠినమైన చర్యలు తప్పవని కూడా తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. స్టాలిన్ వార్నింగ్ తో మంత్రులు, ఎంఎల్ఏలకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లయ్యింది. తమిళనాడులో వ్యక్తిపూజ ఏ స్దాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. మొన్నటి వరకు అమ్మ (జయలలిత) కనబడగానే సాష్టాంగ నమస్కారాలు చేయటానికి మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు, నేతలు ఎంతగా పోటీపడేవారు అందరికీ తెలిసిందే.
ఇంతగా కాకపోయినా కరుణానిధిని పొగడటానికి కూడా పార్టీ నేతలు బాగా పోటీపడేవారు. తమ అధినేతల కాళ్ళకు దండాలు పెట్టడం, పొగడ్తల్లో ఆకాశానికి ఎత్తేయటం మాత్రమే తెలిసిన మంత్రులు, ఎంఎల్ఏలకు సీఎం తాజా వార్నింగ్ ఏమాత్రం మింగుడుపడనిదనే చెప్పాలి. ఒక్క తమిళనాడు అనేకాదు వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్రంలోని పెద్దలది కూడా ఇదే తంతు. చుట్టు భజనపరులను పెట్టుకోవటం తాము తీసుకున్న నిర్ణయం ఎలాంటిదైనా, ఏమి మాట్లాడినా బ్రహ్మాండమంటు పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తుంటే హ్యాపీగా ఫీలవ్వటాన్ని చూస్తున్నదే.
తెలుగు రాష్ట్రాల విషయాన్నే తీసుకుంటే తమశాఖల్లోని సమస్యలు, నియోజకవర్గాల్లోని సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కారాల విషయంలో ఎంతమంది మంత్రులు, ఎంఎల్ఏలు నిజంగా దృష్టిపెట్టారో టార్చిలైట్ వేసి వెతకాల్సిందే. ఎంతసేపు అధినేతను పొగడటం, వారిమెప్పుకోసం ప్రతిపక్షాలను నోటికొచ్చినట్లు మాట్లాడటమే సరిపోతోంది. ఇక ప్రతిపక్షాల తీరుకూడా అలాగే ఉంటోంది. ప్రతిచిన్న విషయాన్ని యాగీ చేసేస్తు సంబంధంలేని విషయాలను కూడా ప్రభుత్వానికి పూసేసి బురద చల్లేస్తున్నారు. ఇలాంటి వాళ్ళంతా స్టాలిన్ను చూసి నేర్చుకోవాల్సిందే.
This post was last modified on August 29, 2021 2:12 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…