అవును మీరు చదివింది నిజమే. పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి పగ్గాలు అందుకోగానే ఆ దూకుడును టీఆర్ఎస్ తట్టుకోలేకపోతోంది. ఇందుకు తాజా ఉదాహరణ ఏమిటంటే రేవంత్ పై టీఆర్ఎస్ నేతలు సోనియాగాంధికి ఫిర్యాదు చేయటమే. ప్రత్యర్ధుల విషయంలో ఒక్కోనేత ఒక్కో విధంగా స్పందిస్తుంటారు. ఆ స్పందనలు ఒక్కోసారి సృతిమించిపోవటం మనం అందరం చూస్తున్నదే. ప్రత్యర్ధులను నోటికొచ్చినట్లు తిట్టడమన్నది కేసీయార్తోనే మొదలైందని చెప్పాలి.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో సీమాంధ్ర నేతలను, జనాలను కేసీయార్ కొన్ని వేలసార్లు నోటికొచ్చినట్లు తిట్టారు. సరే ఉద్యమ సమయంలో ఏదో అన్నారులే అనుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్నే కంటిన్యుచేశారు. ఇంతకాలం కేసీయార్ కు ధీటుగా సమాధానం చెప్పే నేత పీసీసీ అధ్యక్షుడిగా రాలేదు కాబట్టి సరిపోయింది. కానీ రేవంత్ పార్టీ పగ్గాలు అందుకోగానే సీన్ మొత్తం మారిపోయింది. అంతకుముందు కేవలం ఒక నేతగా మాత్రమే కేసీయార్ ను రేవంత్ ఎటాక్ చేసేవారు.
ఎప్పుడైతే పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుండే రేవంత్ దూకుడు పెరిగిపోయింది. నిజానికి కాంగ్రెస్ లో కేసీయార్ కోవర్టులున్నారనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనా కాంగ్రెస్ నేతల్లో కేసీయార్ పై మాటలతో దాడులు చేసే నేతలు పెద్దగా లేరనేచెప్పాలి. ఆ లోటును ఇపుడు రేవంత్ నూరుశాతం భర్తీ చేస్తున్నారు. రేవంత్ దూకుడును టీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారు. అందుకనే రేవంత్ పై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధికి ఫిర్యాదుచేశారు.
అంటే రేవంత్ పై ఫిర్యాదు చేయటం ద్వారా టీఆర్ఎస్ నేతలు పీసీసీ అధ్యక్షుడిని హీరోని చేసినట్లే. ప్రత్యేక తెలంగాణా ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ను కేసీయార్ మోసం చేశారనే మంట సోనియాలో ఉందట. కాబట్టి ఇపుడు కేసీయార్ పై రేవంత్ పదే పదే మాటలతో దాడులు చేస్తుండటాన్ని సోనియా హ్యాపీగా ఫీలవుతున్నారనే అనుకోవాలి. రేవంత్ ఆరోపణలు, విమర్శలతో కేసీయార్ ఏ స్ధాయిలో సఫొకేషన్ ఫీలవ్వకపోతే తన నేతలతో ఫిర్యాదు చేయిస్తారు.
తాను నేర్చుకున్న మీడియా మ్యానేజ్మెంట్ కారణంగా రేవంత్ కు మీడియా కూడా బాగా కవరేజి ఇస్తోంది. దళితబంధు పథకం అమలు విషయంలో కావచ్చు, దళిత, గిరిజన దండోరా యాత్రలకు కూడా కావచ్చు మీడియా ఫుల్లుగా కవరేజి ఇచ్చింది. దానికితోడు చెప్పదలచుకున్న విషయాన్ని సుత్తిలేకుండా సూటిగా, జనాలకు అర్ధమయ్యేట్లుగా చెప్పటం రేవంత్ కున్న అతిపెద్ద ప్లస్ పాయింట్. మొత్తానికి రేవంత్ దెబ్బకు టీఆర్ఎస్ కిందా మీదా అయిపోతోందని అర్ధమైపోతోంది.
This post was last modified on August 29, 2021 2:10 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…