వైసీపీ నేతలు ఏ ఇద్దరు కలిసినా.. ఇప్పుడు.. మూడు రాజధానుల విషయంపైనే చర్చించుకుంటున్నారు. నిజానికి ఏడాదిన్నరకు పైగానే ఈ విషయం చర్చనీయాంశంగా ఉంది. అయితే.. ఇప్పటి వరకు కోర్టు లు కేసులు.. అంటూ.. వివాదంగా మారింది. మరోవైపు.. రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ.. అక్కడి రైతులు డిమాండ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో.. మూడు రాజధానుల విషయంపై వైసీపీ నాయకులు బాహాటంగా మాట్లాడుకోలేక పోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఇప్పుడు మళ్లీ ఈవిషయంపై నేతల మధ్య చర్చ మొదలైంది.
మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని.. వైసీపీ నాయకులు గుసగుసలాడుతున్నారు. అంతేకాదు.. న్యా య పరమైన ఇబ్బందులు కూడా తొలిగిపోతాయని.. త్వరలోనే రాజధాని మార్పు ఖాయమని.. చెబుతు న్నారు. మరి దీనికి రీజనేంటి? ఎందుకు ఒక్కసారిగా వైసీపీ నేతల్లో ఆశలు పుంజుకున్నాయి? అనే విష యాన్ని పరిశీలిస్తే.. ఇటీవల హైకోర్టు.. ఒక విషయంలో రాష్ట్ర ప్రబుత్వానికి సానుకూలంగా వ్యాఖ్యానిం చింది. రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు విషయంలో జరిగిన విచారణలో.. ఈ కమిషన్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది.. రాష్ట్ర సర్కారు ఇష్టమని.. కోర్టు స్పష్టం చేసింది.
దీంతో ప్రభుత్వానికి న్యాయ పరంగా మద్దతు లభించినట్టు అయిదని.. నిపుణులు కూడా వ్యాఖ్యానించారు. ఇక, ఈ క్రమంలో మూడు రాజధానులకు కూడా న్యాయపరమైన చిక్కులు తొలిపోవడం ఖాయమని అం టున్నారు వైసీపీనాయకులు. ఎలా అంటే.. మూడు రాజధానులు ఉండాలా? 30 రాజధానులు ఉండాలా? అనే విషయంలో తమకు సంబంధం లేదని.. కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిందని.. అంతేకాకుండా.. విభజన చట్టంలోనూ ఒకే రాజధాని నిర్మించుకోవాలని లేదని.. కూడా పేర్కొంది. ఇక, ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే విషయం కూడా ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.
ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు దరిమిలా.. ఖచ్చితంగా మూడుకు న్యాయపరంగా చిక్కులు తొలిగిపోవడం ఖాయమని అంటున్నారు వైసీపీ నాయకులు. ప్రస్తుతం ఇదే విషయంపై జోరుగా చర్చసాగుతుండడం గమనార్హం. అయితే.. ఇప్పటికే కోర్టులో ఈ కేసులు ఉండడంతో ఎటూ మాట్లాడలేక పోతున్నారు. బహిరంగ వ్యాఖ్యలు చేయకపోయినా.. లోలోన మాత్రం మురిసిపోతుండడం గమనార్హం.
This post was last modified on August 29, 2021 10:39 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…