Political News

ఇదేనా సీనియార్టీ… టీడీపీ నేత‌లకు షాక్‌..!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో సీనియ‌ర్లు.. చాలా మంది ఉన్నారు. నిజానికి సీనియ‌ర్లు అంటే.. పార్టీని డెవ ల‌ప్ చేయ‌డంతోపాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని గెలుపు దిశ‌గా న‌డిపించాల్సిన బాధ్య‌త‌ను భుజాల పై వేసుకుంటార‌ని అర్ధం. కానీ, టీడీపీలో ఉన్న సీనియ‌ర్లు.. ఇప్ప‌టికీ.. చంద్ర‌బాబు మొప్పు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆయ‌న దృష్టిలో మంచి మార్కులు పొందేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. లేదా.. త‌మ కోరిక‌లు నెర‌వేర్చుకునేందుకు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌పై పార్టీలో ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. నెటిజ‌న్లు మాత్రం దుమ్మెత్తి పోస్తున్నారు.

సీనియ‌ర్ల‌ను గ‌మ‌నిస్తే.. విజ‌య‌న‌గ‌రం జిల్లా నుంచి క‌డ‌ప వ‌ర‌కు ప‌దుల సంఖ్య‌లోనే ఉన్నారు. వీరంతా గ‌తంలో మంత్రులుగా చ‌క్రాలు కూడా తిప్పారు. పార్టీలోనూ.. టాప్ 10లో ఉన్న‌వారు కూడా ఉన్నారు. ఇక‌, త‌మ వార‌సుల‌కు అవ‌కాశం ఇప్పించుకున్న‌వారు కూడా క‌నిపిస్తారు. కానీ, ఎవ‌రూ కూడా పార్టీ కోసం మ‌న‌సు పెట్టి ప‌నిచేయ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉదాహ‌ర‌ణ‌కు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజును తీసుకుంటే.. ఆయ‌న గ‌డిచిన రెండున్న‌రేళ్ల కాలంలో పార్టీ పురోగ‌తికి ఇటు పుల్ల తీసి అటు వేసింది లేదు. కేవ‌లం త‌న‌కు ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. వెంట‌నే మీడియా ముందుకు వ‌స్తున్నారు. లేకుంటే.. మాత్రం సైలెంట్‌.

ఆర్థిక శాఖ మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుది కూడా ఇదే తంతు. రెండున్న‌రేళ్ల కాలంలో చంద్ర‌బాబు అయినా.. రోడ్డెక్కి ధ‌ర్నాలు చేశారు కానీ, య‌న‌మ‌ల మాత్రం గ‌డ‌ప దాటింది లేదు. పైగా.. ఆర్థిక స‌మ‌స్య‌ల‌పైనా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వ ఆర్థిక విష‌యాల‌పై మీడియా బైట్ల‌కే ఆయ‌న స‌మ‌యం కేటాయిస్తున్నారు త‌ప్ప‌.. క్షేత్ర‌స్థాయిలో పార్టీని ప‌ట్టించుకుని.. నేత‌ల‌ను న‌డిపిస్తున్న దాఖలాలు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డిదీ ఇదే ప‌రిస్థితి. కేవ‌లం.. క్షేత్ర‌స్థాయిలో స‌మస్య‌ల‌పై పోరాటం చేస్తున్నారే త‌ప్ప‌.. పార్టీ మ‌నుగ‌డ‌కు ఉప‌యోగ‌ప‌డే రాష్ట్ర స్థాయి పోరాటాల‌కు ఆయ‌న దూరంగా ఉంటున్నారు.

ఇక‌, కొంద‌రు మాజీ మంత్రులు దూకుడుగా ఉంద‌ని అనుకున్నా.. పార్టీ అధిష్టాన‌మే వీరిని ప‌క్క‌న పెట్టింది . దీంతో .. వీరంతా ఇప్పుడు డ‌మ్మీ నాయ‌కులుగా మారిపోయారు. మ‌రోవైపు.. మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇలానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో సీనియ‌ర్లు కేవ‌లం.. మీడియా ప్ర‌క‌ట‌న‌ల‌కే స‌రా? అంటూ.. నెటిజ‌న్లు రుస‌రుస‌లాడుతుండ‌డం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో పార్టీ అభిమానులు కూడా ఈ ప‌రిణామంపై విస్తు పోతున్నారు. మ‌రి చంద్ర‌బాబుకు ఇవి తెలియ‌వ‌ని అనుకోవాలా? లేక‌.. తెలిసి కూడా మౌనం పాటిస్తున్నార‌ని భావించాలా? అనేది చ‌ర్చ‌కు దారితీస్తోంది.

This post was last modified on August 29, 2021 2:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

4 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

5 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

6 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

7 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

7 hours ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

7 hours ago