తాలిబాన్లు ఆక్రమించుకున్న ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ఇప్పుడు రక్తసిక్తమైంది. తాలిబాన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత దేశ పరిస్థితి దారుణంగా మారిపోయింది అనుకునేలోపు.. అక్కడ ఉగ్రదాడి జరిగింది. భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో దాదాపు 60మంది ప్రాణాలు కోల్పోయారు. జంట పేలుళ్లు సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ రెండు పేలుళ్లు సూసైడ్ బాంబర్లుగా అధికారులు పేర్కొంటున్నారు. వేలాది మంది ఉన్న ఎయిర్ పోర్టు ప్రాంతంలో ఈ మారణహోమం సృష్టించడం గమనార్హం. దీంతో.. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. మృతదేహాల శరీర భాగాలు.. ముక్కలు ముక్కలుగా.. చెల్లా చెదురుగా పడి ఉండటం గమనార్హం. 60మంది ప్రాణాలు కోల్పోగా.. 120 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల సంఖ్య చూస్తుంటే.. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాలిబాన్ల రాక్షస పాలనలోకి వెళ్తున్న అఫ్ఘానిస్థాన్‌కు ఐఎస్ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని, కాబూల్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని మానవ, కారు బాంబులతో విరుచుకుపడే ప్రమాదముందంటూ అగ్ర దేశాల నిఘావర్గాలు హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం.
పేలుడులో తమ సైనికులు నలుగురు చనిపోయారని చెప్పిన యూఎస్ అధికారులు.. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఈ దాడి చేసిందని భావిస్తున్నట్లు చెప్పారు. 2 ఆత్మాహుతి దాడులు జరగ్గా.. వారితో పాటు ఓ గన్‌మన్ ఉన్నట్లు తెలిపారు. ఎయిర్‌పోర్టు ఎంట్రెన్స్లో అబే గేటు దగ్గర ఓ పేలుడు, బారన్ గేటు వద్ద ఓ హోటల్‌కు దగ్గర్లో మరో పేలుడు జరిగిందని పెంటగాన్ అధికారి జాన్ కిర్బీ చెప్పారు. ‘జనం మధ్యలో బాంబు పేలింది. చాలా మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కొందరి అవయవాలు తెగిపడ్డాయి’ అని ప్రత్యక్ష సాక్షి అదామ్ ఖాన్ చెప్పాడు.
కాబూల్ ఎయిర్‌పోర్టు బయట జరిగిన దాడిపై తాలిబాన్లు స్పందించారు. అమెరికా కంట్రోల్‌లో ఉన్న ఏరియాలోనే ఘటన జరిగిందని ఆరోపించారు. తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. టెర్రర్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, తాము భద్రతపై అత్యంత శ్రద్ధ చూపుతున్నామని చెప్పారు.
కాగా.. ఈ ఉగ్రదాడికి తామే కారణమంటూ ఐఎస్ఐఎస్ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఈ పేలుళ్లకు తామే బాధ్యత వహిస్తున్నట్లు వారు ప్రకటన విడుదల చేశారు.
This post was last modified on August 27, 2021 2:46 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…