రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ బలంగానే ఉంది. నాయకులు కూడా బలమైన నాయకులే ఉన్నారు. కానీ, వచ్చే ఎన్నికల్లోనూ.. పార్టీ గెలుపుగుర్రం ఎక్కుతుం దా ? అనేదే ఇప్పుడు డౌట్..! గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతింది. అయితే.. అదంతా జగన్ సునామీ వల్ల.. ఒక్కఛాన్స్ వల్ల జరిగిన నష్టంగా.. టీడీపీ చెబుతోంది. అంటే తమ బలం తరిగిపోలేదని.. ప్రజలు మాకు నవ్యాంధ్రలో ఒక్కఛాన్స్ ఎలా అయితే.. ఇచ్చారో.. అదేవిధంగా జగన్‌కు కూడా ఇచ్చారని.. కాబట్టి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు తమను ఎన్నుకుంటారని.. టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు.
ఇంతవరకే కాదు, నియోజకవర్గాల వారీగా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ గ్రాఫ్ ను సమీక్షించుకు న్నారు. ఈ క్రమంలో జిల్లాల వారీగా చూసుకుంటే.. తూర్పుగోదావరిలోని 16 నియోజవకర్గాల్లో 10 చోట్ల టీడీపీ బలంగా ఉంది, అదే సమయంలో పశ్చిమలోనూ సగం పైగా నియోజకవర్గాల్లో పార్టీ గ్రాఫ్ కొనసాగుతోంది. ఇక, అనంతపురంలోనూ పార్టీ గ్రాఫ్ బాగుంది. కృష్ణా, గుంటూరుల్లో పార్టీ నేతలు బలంగానే ఉన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ.. పార్టీ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. అయితే.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు ఉన్నప్పటికీ.. పార్టీని నడిపించేవారు బలహీనంగా ఉండడం చంద్రబాబు దృష్టికి వచ్చింది.
అంటే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి బాగున్నా పార్టీ బాధ్యతలు చూస్తున్నవారు కొందరు.. మాత్రం లోపాయికారీగా.. అధికార పార్టీ నేతలతో చేతులు కలిపారని చంద్రబాబు గుర్తించారు. దీనికి కూడా కారణాలను ఆయన అన్వేషించినట్టు సమాచారం. గత ఎన్నికల్లో.. ముక్కోణపు పోటీ జరిగింది. అంటే.. వైసీపీ-టీడీపీ-జనసేనలు వేర్వేరుగా పోటీ చేశాయి. దీంతో ఈ పోటీని తట్టుకుని గెలుపు గుర్రం ఎక్కేందుకు.. టీడీపీ నాయకులు.. బాగానే ఖర్చు చేశారు. కొందరు సొంత ఆస్తులను కూడా అమ్ముకున్నారనే వార్తలు వచ్చాయి. అయితే వారంతా కూడా ఓడిపోయారు.
దీంతో వారు ఈ అప్పులు పూడ్చుకునే క్రమంలో కొంత రాజీ పడుతున్నారని.. చంద్రబాబుకు తెలిసింది. ఇక మరి కొందరు నేతలు తమ పనులు కావడం లేదని లోపాయికారిగా అధికార పార్టీ నేతలకు సహకరిస్తున్నారు. దీంతో పార్టీ కోసం పోరాడే అసలు సిసలైన కార్యకర్తలు తగ్గిపోతున్నారు. వీళ్లను బట్టే ఓటర్లు కూడా వైసీపీ వైపు టర్న్ అవుతున్నారు. దీంతో వారందరికీ .. ఆయన 6 నెలల పాటు డెడ్‌లైన్ విధించారని.. ఏడాది తర్వాత పార్టీని యాక్టివేట్ చేయాలని షరతు విధించారని.. పార్టీలో చర్చ సాగుతోంది.
This post was last modified on August 28, 2021 8:52 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…