టీడీపీ సీనియర్ నాయకుడు.. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజకీయ భవితవ్యం పార్టీలో చర్చనీయాంశంగానే ఉంది. ఆయనకు మద్దతిచ్చేవారు.. ఒక విధంగా చర్చ చేస్తుంటే.. ఆయనను వ్యతిరేకించే వర్గం.. మరో విధంగా వ్యాఖ్యలు చేస్తోంది. పార్టీలో సీనియర్ అయిన.. బుచ్చయ్య.. ఆది నుంచి కూడా పార్టీ వాయిస్ వినిపించారు. సామాజికవర్గం పరంగా.. చంద్రబాబు వర్గమే అయిన.. బుచ్చయ్య గతంలో ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత.. పార్టీ చంద్రబాబు ఆధీనంలోకి వచ్చాక కూడా చాన్నాళ్లు ఎదురు చూశారు. అన్నగారి మరణంతో ఆయన బాబు వైపు మొగ్గు చూపారు.
ఇక, అప్పటి నుంచి పార్టీలో కీలకనేతగా ఉన్నారు.కానీ, పదవుల విషయంలో మాత్రం బుచ్చయ్యకు కాలం కలిసిరావడం లేదు. గతంలో 2014లో నవ్యాంధ్రలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు.. బచ్చయ్య మంత్రి పదవిని ఆశించారు. అయితే.. అది దక్కలేదు. ఇక, ఇప్పుడు పార్టీ అధికారంలోకి వస్తుందనే అంచనాలపై సీనియర్లు సైతం నోరు విప్పడం లేదు. దీంతో ఒక సీనియర్‌గా పార్టీలో అయినా.. తనకు వాయిస్ వినిపించే అవకాశం ఇవ్వాలని.. తన నిర్ణయాలకు కూడా విలువ ఇవ్వాలని.. బుచ్చయ్య కోరుకుంటున్నారు. ఈ అసంతృప్తితోనే.. ఆయన ఇటీవల రాజీనామా ప్రకటించి.. సంచలనం సృష్టించారు.
ఇదిలావుంటే.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకివస్తే.. బుచ్చయ్యను రాజ్యసభకు పంపించాలనేది.. ఆయన వర్గం చేస్తున్న డిమాండ్. అంటే.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగాకానీ, ఎంపీగాకానీ, ప్రత్యక్ష రాజకీయాల్లో బుచ్చయ్య పాల్గొనేది లేదని స్పష్టమవుతోంది. వాస్తవానికి ఇదే విషయాన్ని ఆయన ఎప్పుడో స్పష్టం చేశారు. అయితే.. తన నియోజకవర్గంలో మాత్రం తన హవా సాగాలనేది ఆయన వ్యూహం. కానీ, ఓ వర్గం నాయకులు మాత్రం బుచ్చయ్యకు మీరే పదవి అయినా.. ఇచ్చుకోండి.. కానీ, నియోజకవర్గంలో మాత్రం ఆయన హవా తగ్గించాల్సిందేనని పట్టుబడుతున్నారు.
దీంతో ఈ వర్గం.. ఆయనకు రాజ్యసభ ఇచ్చినా. తమకు అభ్యంతరం లేదని.. కానీ, నియోజకవర్గాన్ని మాత్రం తమ చేతుల్లో పెట్టాలనే డిమాండ్ చేస్తోంది. ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ చక్రం తిప్పుతున్న ఈ కుటుంబం డిమాండ్‌పై చంద్రబాబు ఎటూ తేల్చుకోలేక పోతున్నారని అంటున్నారు సీనియర్లు.. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on August 25, 2021 10:45 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…