ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు, వెళ్ళిపోవడానికి గడువు పొడిగించే సమస్యే లేదని తాలిబన్లు తేల్చిచెప్పారు. అమెరికా, ఇంగ్లాండ్ తో పాటు నాటో దళాలు దేశాన్ని విడిచిపెట్టడానికి గతంలో నిర్ణయించుకున్న ఆగస్టు 31 డెడ్ లైన్ ఎట్టి పరిస్థితుల్లోను పొడిగించేది లేదని తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ తేల్చిచెప్పారు. ఒకవేళ గడువు దాటినా దేశం విడిచి వెళ్ళని దళాలకు ఏదైనా జరిగితే దాని బాధ్యత తమది కాదని కూడా తాలిబన్లు హెచ్చరించటం ఆశ్చర్యంగా ఉంది.
గడువు దాటిన తర్వాత కూడా అమెరికా, ఇంగ్లాండ్ సైనిక దళాలు దేశాన్ని విడిచి పెట్టకపోతే ఆఫ్ఘన్ పై దురాక్రమణ చేయడంగా భావిస్తామని తాలిబన్లు ప్రకటించారు. విచిత్రమేమిటంటే తాలిబన్లు చేసిందే ఆక్రమణ. మళ్ళీ రివర్స్ లో అమెరికా దళాలను ఆక్రమణదారులుగా పరిగణిస్తామంటు హెచ్చరికలొకటి. డెడ్ లైన్ రెడ్ లైన్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అమెరికాపైనే ఉందని ప్రకటించటాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది.
ఏకంగా అమెరికాకే తాలిబన్లు వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగారా ? అనే సందేహాలు మొదలైనాయి. నిజంగానే అమెరికా సైన్యం దేశంలోనే ఉండాలని అనుకుంటే తాలిబన్లు చేయగలిగిందేమీ లేదు. కాకపోతే చిన్నపాటి ప్రతిఘటన తప్పదంతే. అయితే తాలిబన్ల బెదిరింపుల వెనుక అమెరికా చేసిన తప్పిదమే స్పష్టంగా కనిపిస్తోంది. అదేమిటంటే అపారమైన, అత్యాధునికమైన ఆయుధాలను తాలిబన్ల పరం చేయటమే.
అనాలోచితంగా అమెరికా చేసిన తప్పు వల్ల అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, ఎం 16, ఎం 16 ఏ లాంటి అత్యంత అధునాతన ఆయుధాలు తాలిబన్ల చేతుల్లో పడ్డాయి. వీటితో పాటు వందలాది అస్సాల్ట్ రైఫిల్స్ తో పాటు 70 టన్నుల ఆయుధ సామగ్రిని తాలిబన్లు సొంతం చేసేసుకున్నారు. ఇవి కాకుండా పర్వతాలు, లోయలు, ఎడారుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రయాణం చేయగలిగిన సుమారు 700 వాహనాలను కూడా తాలిబన్లు స్వాధీనం చేసేసుకున్నారు. ఈ ధైర్యంతోనే తాలిబన్లు అమెరికాకే డెడ్ లైన్ విధిస్తున్నారు.
This post was last modified on August 24, 2021 10:53 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…