పొరుగునే ఉన్న ఆప్ఘనిస్థాన్లో పరిణామాలతో డ్రాగన్ పిచ్చ హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆప్ఘన్లో ఉన్న ఖనిజాలపై చైనా ఎప్పటినుండో కన్నేసింది. అయితే ఖనిజాలను సొంతం చేసుకోవడం ఇంతకాలం డ్రాగన్ కు సాధ్యం కాలేదు. గతంలోనే ఖనిజాల మైనింగ్ కు చైనా ఒప్పందాలు చేసుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల తవ్వకాలు సాధ్యంకాలేదు. అలాంటిది ఇపుడు ఆ ఒప్పందాలన్నీ స్పీడవుతున్నాయి. అష్రఫ్ ఘనీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ దేశంలో చైనా ఏకపక్షంగా పనులు చేయించుకోవడం సాధ్యం కాలేదు.
తాజా పరిణామాలతో దేశాధిపత్యాన్ని తాలిబన్లు లాగేసుకోవటంతో చైనా మంచి హుషారుగా ఉంది. ఈ దేశంలోని తాజా పరిణామాల వెనుక పాకిస్తాన్, డ్రాగన్లు ఉన్నాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఆప్ఘన్లో రేర్ ఎర్త్ అనే ఖనిజం ఉంది. లక్షల టన్నుల ఈ ఖనిజంపై చైనా చాలా కాలం క్రితమే కన్నేసింది. అయితే వాటిని సొంతం చేసుకోవడానికి అవకాశాలు మాత్రం రాలేదు. కాకపోతే ప్రభుత్వంతో ఒప్పందలైతే చేసుకున్నదంతే.
ఆఫ్ఘన్-చైనా మధ్య 50 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఆఫ్ఘన్ సరిహద్దు బదక్షాన్ ప్రావిన్స్ లోని నజాక్-చైనాలోని షింజియాంగ్ ప్రావిన్స్ మధ్య రాకపోకలకు విశాలమైన రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే 20 శాతం పనులు పూర్తయ్యాయి. ఏదో కారణంతో నిర్మాణ పనులు అనుకున్నంత స్పీడుగా జరగడం లేదు. తాజా పరిణామాల్లో తాలిబన్లు రోడ్డు నిర్మాణ పనులు స్పీడుగా జరగాలని అనుకుంటున్నారట. అంటే ఈ నిర్ణయం వెనుక చైనా పాలకులే ఉన్నారన్న విషయం అర్థమవుతోంది.
రేర్ ఎర్త్ ఖనిజాన్ని కంప్యూటర్లు, రీచార్జి బ్యాటరీలు, విండ్ పవర్, బర్బైన్లు, హైబ్రీడ్ కార్ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నిజానికి ఈ ఖనిజం యావత్ ప్రపంచ దేశాలకు చాలా అవసరం. ప్రస్తుత నేపథ్యంలో చైనాకు మాత్రమే ఖనిజ నిక్షేపాలు తవ్వుకునే అవకాశాలు దొరుకుతాయని అనుమానిస్తున్నారు. తొందరలోనే తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, రెండు ప్రావిన్సుల మధ్య రోడ్డు నిర్మాణం పూర్తయిపోతే చైనా పిచ్చ హ్యాపీనే.
This post was last modified on August 22, 2021 12:45 pm
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…