టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గోరంట్లను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సహా పలువురు టీడీపీ నేతలు, మాజీ మంత్రులు కలిసి మాట్లాడారు. కొందరితో తనకు ఇబ్బందులున్నట్టు గోరంట్ల తమ దృష్టికి తెచ్చారని, కానీ, ఆయన రాజీనామా చేయబోరని అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి చినరాజప్ప మీడియాకు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో వారిద్దరి వ్యాఖ్యల తర్వాత తన రాజీనామాపై గోరంట్ల స్పందించారు. త్వరలో తన అభిప్రాయాన్ని బహిరంగంగా ప్రకటిస్తానని , ప్రస్తుతానికి తానేమీ మాట్లాడనని చెప్పారు. ఆత్మగౌరవ నినాదంతో అన్నగారు పెట్టిన పార్టీలో ఆయన వెన్నంటి నడిచానని, తనకు ఆత్మగౌరవం ముఖ్యమని అన్నారు. దాని కోసమే బతుకుతున్నానని, అది లేనప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటానని గోరంట్ల తన రాజీనామాపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
తాను చంద్రబాబును కలవబోనని, తనను కలిసి చర్చించిన వారు అధినేతను కలిసి తన అభిప్రాయాలను వివరిస్తారని చెప్పారు. పార్టీ నడపడంపై లోపాలున్నాయని గోరంట్ల తెలిపారు. పార్టీని బతికించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తల మనోభావాలను పార్టీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. తన నిర్ణయాన్ని బహిరంగంగానే త్వరలో ప్రకటిస్తానని బుచ్చయ్య చౌదరి తెలిపారు. 30 ఏళ్లుగా టీడీపీతో అనుబంధం ఉందని, ఆత్మగౌరవం కోసమే పోరాటం చేస్తానని వెల్లడించారు.
అంతకుముందు, గోరంట్లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీపరంగా, రాజకీయపరంగా, గోరంట్లకు ఉన్న ఇబ్బందులపై అరగంటపాటు చర్చించినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో తాను వస్తానని, అపుడు అన్ని విషయాలు మాట్లాడతానని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని, అన్ని విషయాలు సర్దుకుంటాయని బుచ్చయ్యకు చంద్రబాబు నచ్చజెప్పినా…గోరంట్ల వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on August 19, 2021 6:34 pm
ఒకప్పుడు ఏ మాయ చేశావే, ఘర్షణ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడు మనుగడ…
టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి సరైన బాక్సాఫీస్ విజయం లేక ఇబ్బంది పడుతున్న పెద్ద సినీ ఫ్యామిలీస్లో అక్కినేని వారిది…
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏదైనా చెబితే అది జరిగేలా పక్కా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ, ఎందుకో కానీ.. ఆయన…
గత ఏడాది డిసెంబరు మొదటి వారంలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్ప: ది రూల్’ దేశవ్యాప్తంగా…
వైసీపీలోనే కాకుండా దాదాపుగా తెలుగు నేలకు చెందిన అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసంపైనే…
దక్షిణాదిలో లెజెండరీ డైరెక్టర్స్ అని ప్రస్తావించాల్సిన వాళ్లలో ఖచ్చితంగా రాయాల్సిన పేరు మణిరత్నం. సౌత్ సినిమా దశాదిశను మార్చేలా ఆయన…