జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈ సారి ఏకంగా తెలంగాణ హైకోర్టు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ పాలకవర్గానికి చెక్ పెట్టినట్టు అయింది. వెంటనే సొసైటీకి స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.. జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో వ్యవహారాలు అదుపుతప్పి నడుస్తున్నందున సొసైటీ పర్యవేక్షణకు, నియంత్రణకు స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని తెలంగాణా హైకోర్టు ఆదేశించింది. తెలంగాణా కో ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్-కమ్-కమిషనర్ ను తాజాగా ఆదేశించింది.
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ ఎ.మురళీముకుంద్ స్పెషలాఫీసర్ నియామకం కోరుతూ పిటిషన్ వేయడంతో హైకోర్టు ఈ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అలాగే హౌసింగ్ సొసైటీ సెక్రటరీ అధికారాలు తొలగిస్తూ సొసైటీ ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ ఈ నెల 12 న జారీ చేసిన నోటీసు ను కూడా తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది.
అలాగే మురళీ ముకుంద్ పిటిషన్‌ను పరిశీలించి ప్రతివాదులైన సహకారశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, సహకార సొసైటీల రిజిస్ట్రార్, జూబ్లీహిల్స్ సొసైటీ ప్రెసిడెంట్ బొల్లినేని రవీంద్రనాథ్‌కు నోటీసులు జారీ చేసింది.
సొసైటీ సెక్రటరీగా తన హక్కులకు ప్రెసిడెంట్, ఇతర మేనేజింగ్ కమిటీ సభ్యులు భంగం కలిగిస్తున్నారని, మీటింగ్స్‌కు కూడా రానివ్వడంలేదనీ, తన బాధ్యతలను నిర్వర్తించనివ్వడం లేదని పిటిషన్‌లో మురళీముకుంద్ పేర్కొన్నారు. పిటిషనర్ అభ్యర్థించిన మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఉంటాయని బెంచ్ పేర్కొంది.
This post was last modified on August 19, 2021 5:11 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…