గంటా శ్రీనివాసరావు… ఆయన ముందు విశాఖలో ఒక మీడియా సంస్థలో ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత వ్యాపార రంగంలోకి వచ్చారు. ఇక అక్కడ నుంచి రాజకీయ నాయకులతో పరిచయాలు కావడంతో ఆ వైపుగా ఆసక్తి మళ్ళింది. అయితే ఆయన మొదట ఎంచుకున్న పార్టీ బీజేపీ కావడం విశేషం. కానీ 1999 ఎన్నికల వేళ విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ సీటుకు సరైన అభ్యర్ధి లేకపోవడంతో చంద్రబాబు తటస్థులకు ఛాన్స్ అంటూ ఇచ్చిన పిలుపు మేరకు గంటా టీడీపీలో చేరి అనకాపల్లి నుంచి పోటీ చేశారు. ఆ ఊపులో ఆయన ఎంపీ అయిపోయారు. అంతే కేవలం అయిదేళ్ల కాలంలోనే ఆయన రాజకీయంగా పట్టు సాధించారు.
ఇక ఆయన కన్ను మంత్రి పదవి మీద పడింది. అందుకే పట్టుబట్టి మరీ 2004 ఎన్నికల్లో ఆయన విశాఖ జిల్లా చోడవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. కానీ టీడీపీ ఏపీలో ఓడింది. ఇక 2009 నాటికి ప్రజారాజ్యంలో చేరారు. ఆ తరువాత ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో గంటా కోరిక 2012 నాటికి నెరవేరింది. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా బాధ్యతలు తొలిసారిగా నిర్వహించారు. ఆ తరువాత 2014 నాటికి చంద్రబాబు పిలుపు మేరకు మళ్ళీ టీడీపీలో చేరిన గంటా అక్కడ కూడా అయిదేళ్ళ పాటు మంత్రిగా పనిచేశారు.
మొత్తానికి రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏడేళ్ల పాటు మంత్రిగా చేసిన గంటా 2019 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచి విపక్షంలోకి వచ్చేశారు.
గత రెండేళ్ళుగా అసలు ఎక్కడా కనిపించడంలేదు. ఆయన ఉన్న తెలుగుదేశం పార్టీలో యాక్టివిటీ లేదు. వైసీపీలో ఆయన చేరేందుకు ఎన్నో షరతులు వర్తిస్తాయని బోర్డు పెట్టేశారు. దాంతో గంటా రాజకీయం అయోమయంలో పడింది. గంటా వంటి డైనమిక్ లీడర్ పొలిటికల్ కెరీర్ మొత్తం రెండు దశాబ్దాల పాటు దూకుడుగా సాగింది కానీ ఇపుడు మాత్రం మసకబారింది అనే చెప్పాలి.
ఆయన 2024 నాటికి ఏ పార్టీలో చేరుతారు అన్నది ఎవరికీ తెలియదు. మరో వైపు ఆయనకు వెన్నంటి ఉన్న అనుచరులు అంతా కూడా వైసీపీలో చేరిపోయారు. దాంతో గంటా ఒంటరి వారు అయ్యారు. టీడీపీలో కనీసం పార్టీ పదవులు కూడా గంటాను వరించలేదు. చంద్రబాబు, లోకేష్ ఆయనను పక్కన పెట్టేశారు. టీడీపీలో ఉన్నా పోటీ చేసేందుకు సీటు కూడా లేదు అంటున్నారు. దీంతో గంటా పాలిటిక్స్ రిస్క్ లో పడిందనే అంటున్నారు.
అయితే గంటా రాజకీయ చాతుర్యం గొప్పది. 2024 నాటికి ఆయన ఏదో విధంగా మ్యాజిక్ చేసి గెలిచే పార్టీలో ఉంటారని మళ్లీ మంత్రి అవుతారని అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఆయన గెలిచే పార్టీ అంటే ఎందులో ఉంటారో. ఏ రకమైన రాజకీయం చేస్తారో..?
This post was last modified on August 19, 2021 2:57 pm
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…