మొత్తానికి చాలా ఏళ్ల నుంచి భయపడుతున్నదే జరిగింది. అఫ్గానిస్థాన్ దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. అమెరికా అండతో ఎన్నో ఏళ్ల నుంచి తాలిబన్లను ఎదుర్కొంటూ వచ్చిన అక్కడి ప్రభుత్వం చివరికి చేతులెత్తేసింది. అఫ్గాన్ అధీనంలో ఉన్న సైన్యం సంఖ్య 3 లక్షలు. తాలిబన్ల సైన్యం 87 వేలే. ఇంత అంతరం ఉన్నా సరే.. తమ అరాచకత్వం, స్థానికుల మద్దతుతో తాలిబన్లు ప్రభుత్వాన్ని పడగొట్టగలిగారు. అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు.
తాలిబన్ల అరాచకత్వం ఎలా ఉంటుందో బాగా తెలిసిన అఫ్గాన్లు చాలామంది దేశం విడిచి వెళ్లిపోవడానికి విఫలయత్నం చేస్తున్నారు. అమెరికా విమానం రెక్కల మీద కూర్చుని ప్రయాణం చేయడానికి కూడా సాహసించారంటే వాళ్లెంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. పురుషుల పరిస్థితే ఇలా ఉంటే.. అఫ్గానిస్థాన్‌లో మహిళల పరిస్థితి తలుచుకుంటే హృదయం ద్రవించక మానదు. మహిళల విషయంలో తాలిబన్ల అరాచకం మామూలుగా ఉండదు. మహిళలకు వాళ్లు పెట్టిన షరతులు చూస్తే వారి పరిస్థితి ఊహించుకోవడానికి కూడా భయమేస్తుంది. ఆ షరతులేంటో ఒకసారి పరిశీలించండి.
ముస్లిం మహిళలు ఎవ్వరూ కూడా చదువుకోవడానికి వీల్లేదు. వాళ్లసలు బయటికే రాకూడదు. ఇంటికే పరిమితం కావాలి. తప్పనిసరి అయి బయటికి రావాలంటే వారితో పాటు కచ్చితంగా ఒక మగాడుండాలి. ఒంటరిగా ఎవరైనా మహిళలు బయట కనిపిస్తే దెబ్బలు తప్పవు. బయట కనిపించే మహిళలందరూ బురఖా ధరించాలి. ముఖం కనిపించనివ్వకూడదు. అమ్మాయిలెవ్వరూ బడికి పోవడానికి వీల్లేదు. మహిళలెవ్వరూ సౌందర్య సాధనాలు ఉపయోగించడానికి వీల్లేదు. కాస్మొటిక్స్ జోలికి వెళ్లకూడదు. ఆభరణాలూ ధరించకూడదు. ఆకర్షణీయమైన దుస్తులు ధరించకూడదు. తప్పనిసరి అయితే తప్ప మాట్లాడకూడదు.
బహిరంగ ప్రదేశాల్లో మహిళలు నవ్వడానికి వీల్లేదు. అలా చేస్తే కొట్టొచ్చు. గోళ్లకు నెయిల్ పాలిష్ కూడా వేయడానికి వీల్లేదు. అలా చేస్తే వేలు కత్తిరించేస్తారు. మహిళలు బయటెక్కడా పని చేయడానికి వీల్లేదు. వేరే పురుషులతో శృంగారంలో పాల్గొన్నట్లు తేలితే వారిని బహిరంగంగా చంపేస్తారు. ఇవీ తాలిబన్లు మహిళలకు పెట్టిన షరతులు. ఇలాంటి నిబంధనల మధ్య ఇకపై అఫ్గాన్‌లో మహిళల జీవితాలు ఎంత దుర్భరంగా ఉండబోతున్నాయో అంచనా వేసుకోవచ్చు. తాలిబన్లు అఫ్గాన్‌ను చేజిక్కించుకోవడం ఆలస్యం.. ఒక విదేశీ మహిళా రిపోర్టర్ వెంటనే బురఖా ధరించి టీవీలో న్యూస్ రిపోర్ట్ చేయడాన్ని బట్టి వారి అరాచకత్వం ఎలా ఉంటుందన్నది అంచనా వేయొచ్చు.
This post was last modified on August 17, 2021 7:20 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…