ఆప్ఘనిస్తాన్ ని పూర్తిగా తాలిబన్లు ఆక్రమించుకున్నారు. తాలిబన్లు ఎంటర్ కావడంతో.. ఆ దేశ అధ్యక్షుడు అఫ్రాఫ్ గని పరారయ్యాడన్నసంగతి కూడా తెలిసిందే. దేశానికి ఆపద వస్తే.. అధ్యక్షుడు అలా పారిపోయాడనే వార్త ఇప్పటికే ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. అంతకుమించి ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. అష్రాఫ్ గని పోతూ పోతూ.. డబ్బల మూటలు కట్టుకొని మరీ వెళ్లిపోవడం గమనార్హం.
తాజా సమాచారం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని, నాలగు కార్ల నిండా డబ్బు మూటలు కట్టుకుని, అందులో సరిపోకపోతే హెలికాప్టర్ లో ఎక్కించుకుని పారిపోయినట్లు సమాచారం బయటకి వచ్చింది. ఈ మేరకు కాబూల్ లోని రష్యన్ రాయబార కార్యాలయం పేర్కొంది.
నాలుగు కార్లు డబ్బుతో నిండి ఉన్నాయి. అదీగాక కొంత డబ్బుని హెలికాప్తర్ లో నింపాలని చూసారు. అందులో కొంత డబ్బు రోడ్డు మీద పడి ఉందని, రష్యా రాయబార కార్యాలయ ప్రతినిధి నికితా ఇష్చెంకో వెల్లడించిందని, RIA న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి బిస్మిల్లా మహ్మదీ చేసిన ఒకానొక ట్వీటులో, మా చేతులను బంధించి మా మాతృభూమిని అమ్మారని, దీనికంతటికీ కారణం ఆ ధనవంతుడే అని అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ పోస్ట్ చేసారు.
ఆఫ్ఘనిస్తాన్ సీనియర్ నాయకుడు అబ్దుల్లా మాట్లాడిన ఒకానొక వీడియో ప్రకారం, అష్రాఫ్ ఘని దేశం విడిచి వెళ్ళిపోయి ఉంటాడని వ్యాఖ్యానించారు. తాలిబన్ తిరుగుబాటు దారులు దేశాన్ని ఆక్రమించుకోవడానికి కారకులైన అధ్యక్షుడు ఘని, ఉపాధ్యక్షుడు.. ఇద్దరూ కలిసి దేశం విడిచి వెళ్ళిపోయి ఉంటారని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అయ్యాక అధ్యక్షుడు ఘని నుండి ఒక్క సందేశం కూడా బయటకు రాలేదు. మరో పక్క ఉపాధ్యక్షుడు కూడా స్పందించలేదు. అదే అంతకుముందు ఒకసారి మాట్లాడిన ఉపాధ్యక్షుడు, దేశాన్ని ఎవరి చేతుల్లోకి వెళ్ళనివ్వము అని కామెంట్లు చేసాడు.
This post was last modified on August 17, 2021 3:13 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…