Political News

తాలిబన్ల దెబ్బ అంత గట్టిగా పడిందా ?

ఆఫ్ఘనిస్ధాన్ లో తాలిబన్ల అరాచకాలను విదేశాలు కూడా తట్టుకోలేకపోతున్నాయి. రాజధాని కాబూల్ నుండి తమ రాయబార కార్యాలయాల్లోని ఉన్నతాధికారులను, ఉద్యోగులందరినీ తిరిగి వచ్చేయాలంటు ఆయా దేశాలు ఆదేశాలు జారీ చేశాయి. అన్నీ దేశాలకన్నా ముందుగా అమెరికా, ఇండియాలు తమ సిబ్బందిని వెనక్కు పిలిపించేస్తున్నాయి. అమెరికా అయితే తమ మిలిట్రీని దగ్గరుండి మరీ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న వారందరినీ విమానాలెక్కించేస్తోంది.

విమానాల్లో ప్రయాణించటానికి కుదరని ఉద్యోగుల కోసం ప్రత్యేకించి హెలికాప్టర్లలో సమీప ప్రాంతాలకు తరలించి అక్కడినుండి విమానాల్లో వచ్చే ఏర్పాట్లు చేసింది. ఇదే పద్దతిలో భారత ప్రభుత్వం కూడా సిబ్బందిమొత్తాన్ని దేశానికి తిరిగి వచ్చేయాలని ఆదేశించింది. ఆఫ్ఘన్లో ఉండటం ఇపుడు ఎంతమాత్రం క్షేమంకాదని స్పష్టంగా చెప్పింది. కాబూల్ లోని సుమారు 70 విదేశాల రాయబార కార్యాలయాలు కూడా తమ ఉద్యోగులను ఖాళీ చేయిస్తున్నాయి.

ఇదే సమయంలో దేశ సరిహద్దులన్నింటినీ తాలిబన్లు స్వాధీనం చేసేసుకున్నారు. కాబూల్ లోకి తాలిబన్ సైన్యం ప్రవేశించింది. రాజధానిలోని కీలకమైన ప్రాంతాలను తమ గుప్పిట్లోకి ఉగ్రాదులు తెచ్చేసుకున్నారు. దేశంలో ఉన్న 32 రాష్ట్రాల్లో ఇప్పటికే 20 రాష్ట్రాలు పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. కాబూల్ లో కాల్పులు జరపవద్దని, ప్రజలకు ఎలాంటి నష్టమూ చేయవద్దని ప్రభుత్వం పదే పదే వేడుకుంటోంది. ప్రభుత్వవైఖరి చూస్తుంటే ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది. ఫలితంగా దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేశారు.

ఇప్పటికే ఆర్ధికమంత్రితో పాటు చాలామంది మంత్రులు, గవర్నర్లు దేశంనుండి పరారయ్యారట. అంటే మంత్రులు తాలిబన్లకు దొరక్కుండా తమ దారి తాము చూసుకుంటున్నారు. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కూడా గల్ఫ్ దేశాలకు కానీ లేదా అమెరికాకు కూడా పారిపోవచ్చనే ప్రచారం పెరిగిపోతోంది. ఆఫ్ఘన్లో తాలిబన్లు ఇంత అరాచకాలకు పాల్పడుతున్నా పేరుగొప్ప ఐక్యరాజ్యసమితి ప్రకటనలు ఇవ్వటం, ఆందోళన వ్యక్తంచేయటం మినహా ఇంకేమీ చేయలేకపోతుండటమే ఆశ్చర్యంగా ఉంది.

This post was last modified on August 16, 2021 11:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు ఐడియా: డ్వాక్రా పురుష గ్రూపులు!

రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అన‌గానే మ‌హిళ‌లే గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాలు!…

49 minutes ago

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

8 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

8 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

9 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

9 hours ago